వీడియో: SRHతో మ్యాచ్‌ తర్వాత KL రాహుల్‌ను తిడుతూ అతి చేసిన లక్నో ఓనర్‌!

వీడియో: SRHతో మ్యాచ్‌ తర్వాత KL రాహుల్‌ను తిడుతూ అతి చేసిన లక్నో ఓనర్‌!

LSG Owner, Sanjiv Goenka, KL Rahul: అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ సృష్టించిన విధ్వంసం తర్వాత.. లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేస్తూ కనిపించారు. ఏకంగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై అరుస్తూ అతి చేశారు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

LSG Owner, Sanjiv Goenka, KL Rahul: అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ సృష్టించిన విధ్వంసం తర్వాత.. లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేస్తూ కనిపించారు. ఏకంగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై అరుస్తూ అతి చేశారు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 166 పరుగుల టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం 9.4 ఓవర్లలో ఊదిపారేసింది. సన్‌రైజర్స్‌ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ సృష్టించిన సునామీలో లక్నో బౌలర్లు కొట్టుకుపోయారు. అదే పిచ్‌పై 165 పరుగుల చేసేందుకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ అపసోపాలు పడింది. తొలి 10 ఓవర్లలో కేవలం 57 పరుగులు చేసింది. చివర్లో నికోలస్‌ పూరన్‌, ఆయూష్‌ బదోని కాస్త బ్యాట్‌ ఝళిపించడంతో ఆ మాత్రం స్కోర్‌ అయినా దక్కింది.

పిచ్‌ కాస్త స్లోగా ఉండటంతో 166 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకోవచ్చు అని లక్నో భావించింది. కానీ, వారి ప్లాన్స్‌ను తిప్పికొడుతూ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసం సృష్టించారు. లక్నో బౌలర్లతో చెడుగుడు ఆడుకుంటూ.. ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. పవర్‌ ప్లే అయిపోయినా.. పెద్ద తేడా లేకుండా రెచ్చిపోయి ఆడారు. వారి దెబ్బకు 166 పరుగుల టార్గెట్‌ కాస్త చిన్నబోయింది. కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 167 పరుగులు బాది.. సంచలన విజయం సాధించింది ఎస్‌ఆర్‌హెచ్‌. ఈ దారుణ ఓటమి తర్వాత లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా.. జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో కాస్త కోపంగా మాట్లాడుతూ కనిపించారు.

మ్యాచ్‌ ముగిసిన వెంటనే.. గ్రౌండ్‌లోనే చాలా సేపు కేఎల్‌ రాహుల్‌తో సంజీవ్‌ ఆవేశంగా మాట్లాడారు. రాహుల్‌ ఏదో చెప్పబోతుంటే.. అవేవి నాకు చెప్పొద్దు అన్నట్లు ఆయనే కోపంగా, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్నట్లు మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో.. క్రికెట్‌ అభిమానులు లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయెంకాపై మండిపడుతున్నారు. ఎంత టీమ్‌ ఓనర్‌ అయినంత మాత్రనా.. జట్టు కెప్టెన్‌ను, ఒక టీమిండియా ఆటగాడితో ఇలాగేనా మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 ఏళ్లుగా కప్పు కొట్టకపోయినా.. ఆర్సీబీ, పంజాబ్‌, ఢిల్లీ ఓనర్లు ఆయా టీమ్‌ కెప్టెన్స్‌లో ఇలా ప్రవర్తించడం ఎప్పుడైనా చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments