iDreamPost

Ayodhya: అయోధ్య రామాలయం పోస్టల్ స్టాంపు విడుదుల చేసిన మోడీ

  • Published Jan 18, 2024 | 3:28 PMUpdated Jan 18, 2024 | 3:28 PM

అయోధ్యలో అంతటా పండుగ వాతావరణం నెలకొంది. కొన్ని వందల సంవత్సరాల కల నెరవేరబోతున్నందుకు.. యావత్ భారతదేశం పులకించిపోతుంది. ఈ క్రమంలో తాజగా ప్రధాని నరేంద్ర మోడీ 20 దేశాలకు సంబంధించిన పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

అయోధ్యలో అంతటా పండుగ వాతావరణం నెలకొంది. కొన్ని వందల సంవత్సరాల కల నెరవేరబోతున్నందుకు.. యావత్ భారతదేశం పులకించిపోతుంది. ఈ క్రమంలో తాజగా ప్రధాని నరేంద్ర మోడీ 20 దేశాలకు సంబంధించిన పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

  • Published Jan 18, 2024 | 3:28 PMUpdated Jan 18, 2024 | 3:28 PM
Ayodhya: అయోధ్య రామాలయం పోస్టల్ స్టాంపు విడుదుల చేసిన మోడీ

రామ జన్మ భూమి అయోధ్యలో.. ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మరి కొద్దీ రోజుల్లో వందల సంవత్సరాల ఎదురుచూపులు.. ఫలితం దక్కనుంది. ఈ మహా పుణ్య క్షేత్రం కోసం పోరాడిన వారు ఈరోజున మన మధ్యన లేకున్నా.. వారి పట్టుదలకు ప్రతీకగా.. అయోధ్య రామ మందిరం.. ఘనంగా నిర్మించబడింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమమాలలో.. ఉత్సాహంగా పాల్గొంటున్నారు.  ఈ క్రమంలో తాజాగా నరేంద్ర మోడీ.. రామ మందిర స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందుగా .. ఈరోజున ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ చరిత్రను ప్రపంచమంతా తెలిపే విధంగా.. కొన్ని పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. ఈ స్టాంపులను ఓ పుస్తక రూపంలో పొందుపరిచి.. ఆ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. కాగా, ఈ పుస్తకంలో మొత్తం 48 పేజీలు ఉన్నాయి. ఈ 48 పేజీలలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. ప్రధాని మోడీ మొత్తం ఆరు పోస్టల్ స్టాంపులను విడుదల చేయగా.. దానిలో రామాలయం, హనుమంతుడు, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, మా శబరి ఉన్నాయి. పోస్టల్ స్టాంపును విడుదుల చేసిన తర్వాత నరేంద్ర మోడీ మాట్లాడుతూ తన సందేశాన్ని కూడా అందించారు. “ఈరోజు రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో  నేను పాల్గొనడం విశేషం. ఈరోజు రామ మందిరానికి సంబంధించి ప్రత్యేక స్టాంపులను విడుదల చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో రాముడికి సంబంధించి పోస్టల్ స్టాంపులు విడుదల అయ్యాయి. రామ భక్తులందరికీ నా అభినందనలు. పోస్టల్ స్టాంపులు విధుల్లో ఒకటి.. వాటిని ఎన్వలప్ పై ఉంచడం. వాటి సహాయంతో ముఖ్యమైన లేఖలు, సందేశాలు పంపే సమయంలో ఈ పోస్టల్ స్టాంపులు ప్రత్యేక పాత్రను పోషిస్తాయి” అంటూ మోడీ పేర్కొన్నారు. 

Ayodya Ram mandir stamp

అంతే కాకుండా మన చారిత్రాత్మిక కట్టడాల గురించి తర్వాత  తరాల వారికి తెలియజేయడానికి కూడా.. ఈ పోస్టల్ స్టాంపులు  ఉపయోగపడతాయని తెలియజేశారు. ఇది ఇలా ఉంటే.. ఇక ఇప్పుడు అయోధ్యలో రామ మందిరానికి.. దేశ నలుమూలల నుంచి భారీ ఎత్తున కానుకలు చేరుకున్నాయి.భక్తులు కూడా ఎంతో మంది ఇప్పటికే అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుందన్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీతో పాటు ఎంతో మంది ప్రముఖులు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు.  ఈ క్రమంలో ఈరోజున వేదం మంత్రాలూ .. పండితులు.. భక్తుల నడుమ ఆలయ గర్భ గుడిలో.. శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఆ విగ్రహాలకు షోడశోపచార పూజలు నిర్వహించి. ఘనంగా జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్టను జరపనున్నారు. మరి, ఈ క్రమంలో రాముల వారి పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి