Rishabh Pant Master Mind- Mi vs DC: పంత్ మాస్టర్ మైండ్.. ఒక ప్లాన్ తో మ్యాచ్ రిజల్టే మార్చేశాడు..!

పంత్ మాస్టర్ మైండ్.. ఒక ప్లాన్ తో మ్యాచ్ రిజల్టే మార్చేశాడు..!

MI vs DC- Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్లో మళ్లీ పుంజుకుంది. వరుస విజయాలతో ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. రిషబ్ పంత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. అటు కెప్టెన్ గా కూడా అద్భుతాలు సృష్టిస్తున్నాడు.

MI vs DC- Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్లో మళ్లీ పుంజుకుంది. వరుస విజయాలతో ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. రిషబ్ పంత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. అటు కెప్టెన్ గా కూడా అద్భుతాలు సృష్టిస్తున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ సేన ఆఖరి 5 మ్యాచుల్లో అద్భుతంగా రాణిస్తోంది. ఎవరి అంచనాలకు అందకుండా విజయాలే లక్ష్యంగా దూసుకుపోతోంది. తొలి 5 మ్యాచుల్లో 1 గెలుపు, 4 పరాజయాలు నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఆఖరి 5 మ్యాచుల్లో 1 ఓటమి, 4 విజయాలు నమోదు చేసింది. పంత్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏంట్రా ఢిల్లీ ఇలా ఆడుతోంది అని తలలు పట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు ఇది కదా ఢిల్లీ అంటే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ముంబయితో జరిగిన మ్యాచ్ లో కూడా రిషబ్ పంత్ తన మాస్టర్ మైండ్ తో ఢిల్లీ జట్టకు విజయాన్ని అందించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో పంత్ సేన 10 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది. మైదానంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా జేక్ ఫ్రేజర్(84) దెబ్బకు ముంబయి బౌలర్లు వణికిపోయారు. అలాగే ఢిల్లీ బ్యాటర్లు అంతా మంచి స్కోర్లే చేశారు. ఆ దెబ్బతో నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ జట్టు ఏకంగా 257 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి జట్టు దాదాపుగా గెలిచినంత పని చేసింది. కానీ, 10 పరుగులతో ఓడిపోయింది. అయితే ఈ అనూహ్య ఓటమి ఊరికే రాలేదు. రిషభ్ పంత్ ముంబయి ఓటమిని శాసించాడు. అతను చేసిన ఆ ఒక్క పనితో ముంబయి ఇండియన్స్ కి ఓటమి తప్పలేదు.

ముంబయి జట్టు టాపార్డర్ విఫలమైనా కూడా తిలక్ వర్మ(63) అద్భుతంగా రాణించాడు. టిమ్ డేవిడ్(37)తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ ఇద్దరూ విజృంభిస్తున్నారు. అలాంటి తరుణంలో ముంబయి జట్టుకు విజయం సునాయాసంగా కనపడింది. కానీ, అప్పుడే పంత్ తన ఆలోచనకు పదును పెట్టాడు. టిమ్ డేవిడ్ వీక్ నెస్ తెలుసుకున్నాడు. అప్పటికే ముకేశ్ కుమార్ ఓవర్లో మొదటి 3 బంతుల్లో 6, 4, 6 కొట్టి ఉన్నాడు. వెంటనే పంత్ ముకేశ్ కుమార్ ని పూర్తిగా పేస్ తగ్గించేయన్నాడు. పంత్ కూడా వికెట్ల దగ్గరకు వచ్చాడు. ఇంకేముంది ముకేశ్ కుమార్ వేసిన నెక్ట్స్ బాల్ కు టిమ్ డేవిడ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

టిమ్ డేవిడ్ అవుటయ్యాక పూర్తి భారం తిలక్ వర్మ మీద పడింది. ఆ ప్రెజర్లో స్ట్రైకింగ్ కోసం రెండో పరుగుకు వెళ్లి తిలక్ వర్మ రనౌట్ గా వెనుతిరిగాడు. ఇలా రిషబ్ పంత్ చేసిన ఈ ఆలోచన మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. అదే టిమ్ డేవిడ్, తిలక్ వర్మ మరో 3 బంతులు ఆడున్నా కూడా.. మ్యాచ్ ని ముంబయి జట్టు గెలిచి ఉండేది. ప్రస్తుతం నెట్టింట పంత్ మాస్టర్ మైండ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక మంచి బ్యాటర్, కీపర్ మాత్రమే కాదు.. పంత్ అంటే మంచి కెప్టెన్ కూడా అంటూ కొనియాడుతున్నారు. మరి.. రిషబ్ పంత్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments