IND vs PAK: నాకు ఛాన్స్‌ ఇవ్వండి.. టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియాను చిత్తుగా ఓడిస్తా: పాక్‌ ప్లేయర్‌

IND vs PAK: నాకు ఛాన్స్‌ ఇవ్వండి.. టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియాను చిత్తుగా ఓడిస్తా: పాక్‌ ప్లేయర్‌

Azam Khan, T20 World Cup 2024, IND vs PAK: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ టైమ్‌లో పాక్‌ ప్లేయర్‌ ఓ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

Azam Khan, T20 World Cup 2024, IND vs PAK: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ టైమ్‌లో పాక్‌ ప్లేయర్‌ ఓ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం ఇండియా ఐపీఎల్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా జరుగుతున్నాయి. ఐపీఎల్‌ తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌ 2024 జరగనున్న విషయం తెలిసిందే. జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. టీ20 వరల్డ్‌ కప్‌లో సత్తా చాటాలని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో కసితో ఆడుతున్నారు. దీన్ని ప్రీ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలా భావించి ఆడుతున్నారు. టీమిండియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఇలా ఆలోచించి ఆడుతుంటే.. ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేని పాకిస్థాన్‌ ఆటగాళ్లు మాత్రం పగటి కలలు కంటున్నారు. తాజాగా ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ అయితే.. చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలే చేశాడు.

పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అజమ్‌ ఖాన్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు తెలిసే ఉంటుంది. భారీ కాయంతో ఉంటాడు. బ్యాటింగ్‌లో బిగ్‌ షాట్స్‌ ఆడుతూ ఉంటాడు. ఇతన్ని పాకిస్థాన్‌ హల్క్‌ అని కూడా అంటారు. కొంతకాలంగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో అలాగే పాక్‌ టీమ్‌లో టీ20ల్లో మంచి ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. అయితే.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఇంకా టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ను ప్రకటించలేదు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ తర్వాత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో ప్రకటించిన టీమ్‌లో చోటు దక్కని అజమ్‌ ఖాన్‌.. తాను పాకిస్థాన్‌ టీమ్‌లో ఏ ప్లేస్‌లో ఆడేందుకు అయినా సిద్ధంగా ఉన్నట్లు.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ముఖ్యంగా ఇండియాకు వ్యతిరేకంగా మంచి ప్రదర్శన ఇస్తానంటూ పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

అతను ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై భారత క్రికెట్‌ అభిమానులు జోకులు పేలుస్తున్నారు. ముందు టీమ్‌లో చోటు దక్కించుకో.. తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌ లాంటి బిగ్‌ ఈవెంట్‌లో ఆడి, టీమిండియాను ఓడిద్దువు గానీ అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌ కప్‌ సాధించడమే లక్ష్యంగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తమ ప్లేయర్లకు ఆర్మీ ట్రైనింగ్‌ కూడా ఇప్పించిన విషయం తెలిసిందే. ఓ 20 మంది ఆటగాళ్లుకు వారం రోజుల పాటు కఠినమైన ఆర్మీ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ 20 మంది నుంచే టీ20 వరల్డ్‌ కప్‌ ఆడే టీమ్‌ను ఎంపిక చేయనున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఆడే జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన అజమ్‌ ఖాన్‌.. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో 2024లో భాగంగా జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. మరి అజమ్‌ ఖాన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments