హార్ధిక్‌ పాండ్యాకు తేల్చిచెప్పేసిన BCCI.. అలా అయితేనే టీమ్‌లో ఉంటాడు!

హార్ధిక్‌ పాండ్యాకు తేల్చిచెప్పేసిన BCCI.. అలా అయితేనే టీమ్‌లో ఉంటాడు!

హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా అయితేనే టీమిండియాలో ఉంటావు, లేదంటే లేదు. అన్న వార్నింగ్ పాండ్యాకు ఇచ్చిందట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా అయితేనే టీమిండియాలో ఉంటావు, లేదంటే లేదు. అన్న వార్నింగ్ పాండ్యాకు ఇచ్చిందట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియాలో గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి యంగ్ ప్లేయర్లు బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయిన విషయం మనందరికి తెలిసిందే. దీంతో బీసీసీఐ రాబోయే రోజుల్లో ప్లేయర్లు ఇలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా కొన్ని నిబంధనలను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కొందరు స్టార్ ప్లేయర్లకు వార్నింగ్ సైతం ఇచ్చినట్లు సమాచారం. అందులో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడట.

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో అతడు దారిలోకి వచ్చినట్లు సమాచారం. అసలు విషయం ఏంటంటే? ఈ ఐపీఎల్ సీజన్ కు ముందు టీమిండియాలోని కొంత మంది ఆటగాళ్లు వివిధ కారణాలు చెప్పి డొమెస్టిక్ క్రికెట్ ఆడటం నుంచి తప్పించుకున్నారు. పాండ్యా గాయం అని చెప్పి ఐపీఎల్ సన్నాహకాల్లలో పాల్గొన్న విషయం మనకు తెలియనిది కాదు. అతడితో పాటుగా సోదరుడు కృనాల్ పాండ్యా కూడా ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఇక ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ల పరిస్థితి కూడా ఇదే. దాంతో వీరు బీసీసీఐ ఆగ్రహానికి గురైయ్యారు. ఇషాన్, అయ్యర్ లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది.

ఈ షాకింగ్ డెసిషన్ తో వారు ఆ తర్వాత డీవై పాటిల్ టీ20 కప్ లో ఆడారు. ఇదిలా ఉండగా.. అప్పుడు గాయం కారణంగా డొమెస్టిక్ క్రికెట్ కు దూరంగా ఉన్న పాండ్యాపై కూడా బీసీసీఐ గుర్రుగానే ఉంది. తాజాగా జరిగిన మీటింగ్ లో పాండ్యాకు తేల్చి చెప్పారాట బీసీసీఐ పెద్దలు. డొమెస్టిక్ క్రికెట్ కచ్చితంగా ఆడాలని పాండ్యాకు సూచించిందట బీసీసీఐ. లేదంటే టీమ్ లో ప్లేస్ కష్టమే అంటూ ఇన్ డైరెక్ట్ వార్నింగ్ సైతం ఇచ్చిందట. ఇక దానికి హార్దిక్ సైతం సరే అంటూ బీసీసీఐకి కండిషన్ కు  ఓకే చెప్పాడట.  ఇదిలా ఉండగా.. బీసీసీఐ ప్రధాన కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు త్వరలోనే కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేస్తామని, దానికి రాహుల్ ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చని సూచించాడు. అయితే అతడు ఇండియన్ హా? లేక విదేశీయుడా?  ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నాడు.

Show comments