OTT Movie Suggestion: దెయ్యాలు ఉన్నాయని నిరూపించే సినిమా OTTలోకి! చూసినంత సేపు వణుకు ఆగదు!

OTT Movie Suggestion: దెయ్యాలు ఉన్నాయని నిరూపించే సినిమా OTTలోకి! చూసినంత సేపు వణుకు ఆగదు!

హర్రర్ చిత్రాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో బాగా భయపెట్టే హర్రర్ చిత్రాలు వచ్చినట్లైతే ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఓ మంచి హర్రర్ చిత్రం చూడాలంటే మాత్రం ఒక్కసారి వెనక్కు వెళ్లాల్సిందే. మరి మీరు చూసిన హర్రర్ సినిమాలలో ఈ సినిమాను చూసారో లేదో చెక్ చేసేయండి.

హర్రర్ చిత్రాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో బాగా భయపెట్టే హర్రర్ చిత్రాలు వచ్చినట్లైతే ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఓ మంచి హర్రర్ చిత్రం చూడాలంటే మాత్రం ఒక్కసారి వెనక్కు వెళ్లాల్సిందే. మరి మీరు చూసిన హర్రర్ సినిమాలలో ఈ సినిమాను చూసారో లేదో చెక్ చేసేయండి.

హర్రర్ సినిమాలంటే భయపడే వారు కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పైగా ఇది తెలుగు సినిమా కూడా.. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. హర్రర్ జోనర్ కు సంబంధించిన విషయాలలో కొన్ని సార్లు తెలుగు సినిమాలను తక్కువ అంచనా వేస్తూ ఉంటారు మూవీ లవర్స్. సాధారణంగా హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు మాత్రమే హర్రర్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తాయి అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో కూడా అంతకుమించిన కంటెంట్ తో హర్రర్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తెలుగులో ఉన్న ఈ హర్రర్ సినిమాను మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.

తెలుగులో వచ్చిన ఈ హర్రర్ సినిమా పేరు “జెస్సి“. ఈ సినిమాలో అర్చన, అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, ఆషిమా నర్వాల్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాను కొత్త నటి నటులతో ఓ కొత్త దర్శకుడు రూపొందించాడు. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ ఏ వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. కాబట్టి హర్రర్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను ఓసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమా కథేంటి అంటే.. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ! అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా అవి కేవలం పుకార్లు మాత్రమేనా ! అని కొంతమంది ఘోస్ట్ హంటర్స్ చేసే రీసెర్చ్ ఏ ఈ సినిమా స్టోరీ లైన్.. నిజంగా ఉన్నాయా లేదా అని తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. లేదా ఇంకా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ కలగాలంటే.. ఈ సినిమా కథేంటో తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమా కథేంటంటే.. ఓ నలుగురు స్నేహితులు అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా అని.. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడం కోసం.. ఊరి చివరన ఉన్న విక్టోరియా మహల్ కు వెళ్తారు. వారంతా ఘోస్ట్ హంటర్స్. అక్కడ వారికి ఆ మహల్ యజమాని పరిచయం అయ్యి.. ఆ హౌస్ లో ఉండే ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయి ఆ మహల్ లోనే దెయ్యాలుగా తిరుగుతున్నారని.. ఊరంతా అనుకోవడంతో.. ఆ ఇంటిని ఎవరు కొనడం లేదని. ఎలాగైనా అక్కడ దెయ్యాలు లేవని నిరూపించాలని ఆ ఘోస్ట్ హుంటర్స్ తో చెబుతుంది. కానీ, అక్కడకు వెళ్లిన తర్వాత వారికి నిజంగానే వింత వింత అనుభవాలు ఎదురౌతూ ఉంటాయి. దీనితో ఆ మహల్ లో నిజంగానే దెయ్యం ఉందని వారంతా తెలుసుకుంటారు. స్వయంగా దెయ్యమే ఈ సినిమాలో తానూ ఎలా దెయ్యంగా మారింది అనే విషయాన్నీ వివరించడమే ఈ కథలో అసలైన ట్విస్ట్. అసలు ఆ దెయ్యం వారికి ఏమి చెప్పింది ! ఆ చనిపోయిన అక్కాచెల్లెళ్లు ఎవరు ! ఘోస్ట్ హంటింగ్ లో భాగంగా వారు దెయ్యాలను బంధించారా లేదా! చివరకు ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments