100 Sq Yds Plot At 16 Lakhs: HYDలో ఈ ఏరియాలో 100 గజాల స్థలం 16 లక్షలే! ఈ ఛాన్స్ మళ్ళీ రాదు

HYDలో ఈ ఏరియాలో 100 గజాల స్థలం 16 లక్షలే! ఈ ఛాన్స్ మళ్ళీ రాదు

ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక మంచి ఏరియాలో గజం స్థలం కొనాలంటే కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు లక్ష పలుకుతున్న స్థలాలు ఒకప్పుడు వందలు, వేలు పలికినవే. అందుకే ప్రాపర్టీ బయ్యింగ్ ఈజ్ ప్రాఫిట్ అన్నారు. స్థలాలని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో లక్షలు కోల్పోతారు అని అర్థం. చాలా మంది తక్కువ ధరకు స్థలం వస్తున్నప్పుడు కొనలేదే అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. మీరు అలా ఫీల్ అవ్వకూడదు అంటే స్థలం మీద ఇన్వెస్ట్ చేయండి.

ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక మంచి ఏరియాలో గజం స్థలం కొనాలంటే కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు లక్ష పలుకుతున్న స్థలాలు ఒకప్పుడు వందలు, వేలు పలికినవే. అందుకే ప్రాపర్టీ బయ్యింగ్ ఈజ్ ప్రాఫిట్ అన్నారు. స్థలాలని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో లక్షలు కోల్పోతారు అని అర్థం. చాలా మంది తక్కువ ధరకు స్థలం వస్తున్నప్పుడు కొనలేదే అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. మీరు అలా ఫీల్ అవ్వకూడదు అంటే స్థలం మీద ఇన్వెస్ట్ చేయండి.

రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కి హైదరాబాద్ లో ఉన్న సదాశివపేట ఏరియా పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాగా ఉంది. వేగవంగా అభివృద్ధి చెందుతుండడం, మంచి కనెక్టివిటీ కారణంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు దగ్గరగా ఉండడం వల్ల అటు అర్బన్, ఇటు సబ్ అర్బన్ రెండు ఏరియాలను బ్యాలన్స్ చేసుకోవడానికి మంచి ఛాయిస్ గా ఈ సదాశివపేట ఉంది. హైదరాబాద్-ముంబై హైవేకి దగ్గరగా ఉన్న కారణంగా ఇక్కడ ఇండ్ల స్థలాలకు డిమాండ్ అనేది ఏర్పడింది. మరోవైపు రోడ్లు, రవాణా, ఫ్లై ఓవర్లు, ఫుట్ ఓవర్లు, పార్కులు, విద్యుత్ సరఫరా, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది.

ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?:

ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే.. సదాశివపేటలో భూముల ధరలు హైదరాబాద్ లోని మిగతా ఏరియాలతో పోలిస్తే చాలా తక్కువ. ఇక్కడ ల్యాండ్ రేట్లు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండడం.. 24X7 భద్రత వంటివి ఇన్వెస్ట్మెంట్ కి అనుకూలంగా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. ఇక ఈ ఏరియాలో చదరపు అడుగు స్థలం 1800 రూపాయలుగా ఉంది. 2019లో ఈ ఏరియాలో చదరపు అడుగు 700 రూపాయలుగా ఉండేది. 2021లో 1200, 2022లో 1550, 2023, 2024 వచ్చేటప్పటికి 1800 అయ్యింది. 700 రూపాయలుగా ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు చదరపు అడుగు మీద సగానికి పైనే లాభం.

ఇప్పుడు కొంటే ఎంత లాభం వస్తుంది?:

గజం 6300 రూపాయలు ఉన్నప్పుడు కొన్నవారి స్థలం విలువ ఇప్పుడు 16 వేలు పైనే అయ్యింది. అంటే ఈ ఐదేళ్ళలో 10 వేలు పెరిగింది. ఈ లెక్కన 100 గజాల స్థలం ఒక 6 లక్షలకు కొని ఉంటే.. ఇప్పుడు దాని విలువ 16 లక్షలు పైమాటే. ఐదేళ్ళలో 10 లక్షలు వచ్చినట్టు. అంటే ఏడాదికి 2 లక్షలు చొప్పున లాభం అన్న మాట. అదే 6 లక్షలను 2 రూపాయల వడ్డీకి ఇచ్చినా గానీ నెలకు 12 వేలు వస్తాయి. కానీ భూమి మీద పెట్టుబడి పెట్టినందుకు 16 వేలు పైనే వస్తున్నాయి. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టడం అనేది మంచిదే.

ఇప్పుడు సదాశివపేటలో గజం 16 వేలు పెట్టి కొంటే.. ఐదేళ్ళలో ఓ పదివేలు పెరిగి 26 వేలు అవ్వకుండా ఉంటుందా? అంటే ఇప్పుడు 16 లక్షలు పెట్టి 100 గజాల స్థలం కొంటే ఐదేళ్ళలో 26 లక్షలు అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మీరు పెట్టే పెట్టుబడి మీద 10 లక్షలు లాభం ఉంటుంది. పైగా హైదరాబాద్ అనేది నగర శివారులకు విస్తరిస్తోంది. నగరానికి త్వరగా చేరుకునేలా ట్రాఫిక్ తగ్గించి ట్రావెల్ సమయం తగ్గేలా కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే సదాశివపేటలో స్థలం మీద పెట్టుబడి పెట్టడం అనేది లాభమే.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Show comments