Bank Rules: ఖాతాదారులకు అలర్ట్.. మే నెలలో మారనున్న బ్యాంకు రూల్స్ ఇవే

ఖాతాదారులకు అలర్ట్.. మే నెలలో మారనున్న బ్యాంకు రూల్స్ ఇవే

వచ్చే మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. దీంతో పాటు అనేక నియమాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే మే నెలలో మనీ రూల్స్ మారున్నాయి.

వచ్చే మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. దీంతో పాటు అనేక నియమాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే మే నెలలో మనీ రూల్స్ మారున్నాయి.

మరో మూడు రోజుల్లో ఏప్రిల్ నెల ముగియనున్నది. కొత్త నెల ప్రారంభమవుతుందంటే చాలు బ్యాంకింగ్ సెక్టార్ లో కొత్త రూల్స్ వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలో వచ్చే మే నెలలో మనీ రూల్స్ మారున్నాయి. మారనున్న ఆర్థిక నియమాలతో కస్టమర్లపై ఆర్థిక భారం పడనున్నది. ప్రతి నెల ప్రారంభం నుంచి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రూల్స్, క్రెడిట్ కార్డ్ రూల్స్, ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. సేవింగ్ అకౌంట్లకు సంబంధించిన రూల్స్, బ్యాంకు నిబంధనలు, స్కీమ్స్ విషయంలో మార్పలు చోటుచేసుకుంటాయి. మరి మే నెలలో మారుతున్న రూల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

ఐసీఐసీఐ బ్యాంక్ నిబంధనలు:

ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన సర్వీస్ ఛార్జ్ నిబంధనలు మార్చింది. వార్షిక డెబిట్ కార్డ్‌ ఫీజు విషయంలో.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99, పట్టణ ప్రాంతాల్లో రూ. 200 చెల్లించాలి. బ్యాంక్‌ చెక్‌ విషయంలో.. 25 లీఫ్స్‌ వరకు ఎలాంటి ఛార్జ్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక్కో పేజీకి రూ.4 చొప్పున చెల్లించాలి. ఐఎంపీఎస్ లావాదేవీల ఛార్జ్‌ను రూ. 2.50 నుంచి రూ. 15 వరకు నిర్ణయించారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌:

దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సీనియర్ సిటిజన్‌ల కోసం అమలు చేస్తున్న “హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సీటిజన్ కేర్ ఎఫ్‌డీ” గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం కింద, సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంక్‌ అందిస్తోంది. 5 – 10 సంవత్సరాల కాలపరిమితి ఎఫ్డీపై పెట్టుబడిదారులకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకం కింద, సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు.

యెస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌ రూల్స్‌:

మే 01 నుంచి, వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు నిల్వ మారుతుంది. యెస్ బ్యాంక్ ప్రో మాక్స్‌ మినిమమ్‌ యావరేజ్‌ బ్యాలెన్స్ రూ. 50,000గా మారుతుంది. దీనిపై గరిష్ట రుసుము రూ. 1000గా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలు ఎస్ రెస్పెక్ట్ ఎస్ఏ, ఎస్ ఎస్సెన్స్ ఎస్ఏలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ. 25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుమును రూ. 750గా నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్‌ ప్రోలో కనీస నిల్వ రూ. 10,000. దీనిపై గరిష్ట రుసుము రూ. 750గా మారింది.

Show comments