భర్తని మంచానికి కట్టేసి.. బట్టలు విప్పేసిన భార్య.. ఆపై.. వీడియో చూసి పోలీసులు షాక్..

భర్తని మంచానికి కట్టేసి.. బట్టలు విప్పేసిన భార్య.. ఆపై.. వీడియో చూసి పోలీసులు షాక్..

భర్తలే కాదు.. కొన్ని సందర్భాల్లో భార్యలు కూడా దురుసుగా ఉంటారనడానికి ఈ మహిళే ఉదాహరణ. పడకగదిలో భర్తని దారుణంగా హింసించింది. పాలలో మత్తు పదార్థం కలిపి.. స్పృహ కోల్పోయాక మంచానికి భర్త కాళ్ళూ, చేతులూ కట్టేసి.. బట్టలు విప్పేసింది. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే ఈ కష్టం ఏ మగాడికి రాకూడదని అంటారు.

భర్తలే కాదు.. కొన్ని సందర్భాల్లో భార్యలు కూడా దురుసుగా ఉంటారనడానికి ఈ మహిళే ఉదాహరణ. పడకగదిలో భర్తని దారుణంగా హింసించింది. పాలలో మత్తు పదార్థం కలిపి.. స్పృహ కోల్పోయాక మంచానికి భర్త కాళ్ళూ, చేతులూ కట్టేసి.. బట్టలు విప్పేసింది. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే ఈ కష్టం ఏ మగాడికి రాకూడదని అంటారు.

ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ ప్రాంతానికి చెందిన మన్నన్ జైదీ, మెహెర్ అనే అమ్మాయి.. ఈ ఇద్దరూ గత ఏడాది నవంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్ళైన కొన్ని రోజులకే బలవంతం మీద భర్తతో వేరు కాపురం పెట్టించింది. అలా ఎందుకు పెట్టించిందో అనే విషయం తన భార్యకి మందు, సిగరెట్ అలవాటు ఉందని తెలిసే వరకూ గురుడికి తెలియలేదు. మందు, సిగరెట్ తాగితే అత్తమామలు అడ్డుపడతారని భర్తకు ఇష్టం లేకపోయినా వేరు కాపురం పెట్టించింది. తప్పు చేస్తున్నావని అంటే అతని మీద రివర్స్ అయ్యింది. అప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టింది. భర్తకి టార్చర్ అంటే ఏంటో 4కేలో చూపిస్తూ వచ్చింది. రోజూ భర్తను కొట్టడం.. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడం చేసేదట. ఇక ఆమె పెట్టే టార్చర్ భరించలేక ఆమె భర్త మన్నన్ జైదీ.. తన భార్య తీరు గురించి ఇంట్లో కూడా చెప్పాడు.

ఆ తర్వాత ఏప్రిల్ నెలలో పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతో తన భార్య పెట్టే టార్చర్ కి సంబంధించి సాక్ష్యాలను క్రియేట్ చేయాలని అనుకున్నాడు. దీంతో ఇంట్లో ఆమెకు తెలియకుండా ఒక సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఆ సీక్రెట్ కెమెరాలో ఆమె చేసిన విన్యాసాలన్నీ రికార్డ్ అయ్యాయి. వాటిని పట్టుకుని పోలీసుల దగ్గరకు వెళ్లగా.. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయ్యారు. మన్నన్ కి పాలతో మత్తు కలిపి ఇచ్చింది మెహెర్. భర్త మత్తులోకి జారుకున్నాక చీరలు, చున్నీలతో కాళ్ళు, చేతులూ కట్టేసి.. బట్టలు విప్పేసింది. ఆ తర్వాత అతని మీద కూర్చుని సిగరెట్ తాగింది.

ఆ సిగరెట్ ని అతని ఒంటికి అంటించి కాల్చింది. భర్త మర్మాంగం మీద సిగరెట్ తో చురకలు పెట్టింది. అంతటితో ఆగలేదు. కత్తితో భర్త మర్మాంగాన్ని కత్తిరించాలని ప్రయత్నించింది. ఆ బాధను తట్టుకోలేక స్పృహలోకి వచ్చిన భర్త.. తనను వదిలేయమని ప్రాధేయపడినా గానీ మెహెర్ వినలేదు సరికదా మరింత చిత్ర హింసలు పెట్టింది. ఈ చేష్టలన్నీ వీడియోలో రికార్డ్ అవ్వడంతో మన్నన్.. మరుసటి రోజు ఉదయమే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వీడియోని చూపించాడు. వీడియో చూపించిన తర్వాత బాధితుడిని హాస్పిటల్ లో చేర్పించారు పోలీసులు. అనంతరం మెహెర్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

తనను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా.. తన మీద తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేసిందని బాధిత భర్త వాపోయాడు. పెళ్ళికి ముందు కూడా ఇలానే బెదిరించిందని వాపోయాడు. పెళ్లి చేసుకోకపోతే.. రే*ప్ కేసు పెడతా అని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇతని బాధ విన్నాక నెటిజన్స్.. ఏ కష్టం పగోడికి కూడా రాకూడదని కామెంట్స్ చేస్తున్నారు. మరి మంచానికి కాళ్ళూ, చేతులూ కట్టేసి.. బట్టలు విప్పేసి దారుణంగా ప్రవర్తించిన ఈ లేడీకి ఎలాంటి శిక్ష వేస్తే సరైనదో కామెంట్ చేయండి.

Show comments