Rekha JhunJhunwala Lost 800 Crore: నిమిషాల్లో రూ.800 కోట్లు లాస్! స్టాక్ మార్కెట్ స్ట్రోక్ ఈ రేంజ్ లో ఉంటది!

నిమిషాల్లో రూ.800 కోట్లు లాస్! స్టాక్ మార్కెట్ స్ట్రోక్ ఈ రేంజ్ లో ఉంటది!

భారత దేశంలోని అత్యంత సంపన్నల గల కుటుంబంలో రాకేష్ జున్‌జున్‌వాలా కూడా ఒకరు.ఇక ఈయన దేశంలోని అతి పెద్ద బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ లలో ఒకరు. ఇక ఆయన మరణించిన తర్వాత ప్రస్తుత వ్యాపార పెట్టుబడి బాధ్యతలను ఆయన భార్య రేఖ జున్‌జున్‌వాలా చూసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరికి ఇంట్రాడే ట్రేడింగ్‌లో కొద్ది నిమిషాలా వ్యవధిలో టైటాన్ స్టాక్ పతనం కాగా, ఏకంగా అన్ని కోట్ల నష్టం వాటిల్లింది.

భారత దేశంలోని అత్యంత సంపన్నల గల కుటుంబంలో రాకేష్ జున్‌జున్‌వాలా కూడా ఒకరు.ఇక ఈయన దేశంలోని అతి పెద్ద బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ లలో ఒకరు. ఇక ఆయన మరణించిన తర్వాత ప్రస్తుత వ్యాపార పెట్టుబడి బాధ్యతలను ఆయన భార్య రేఖ జున్‌జున్‌వాలా చూసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరికి ఇంట్రాడే ట్రేడింగ్‌లో కొద్ది నిమిషాలా వ్యవధిలో టైటాన్ స్టాక్ పతనం కాగా, ఏకంగా అన్ని కోట్ల నష్టం వాటిల్లింది.

భారత దేశంలోని అత్యంత సంపన్నల గల కుటుంబంలో రాకేష్ జున్‌జున్‌వాలా కూడా ఒకరు.ఇక ఈయన దేశంలోని అతి పెద్ద బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ లలో ఒకరు. అలాగే గామా మీడియా, ఆప్‌టెక్‌లకు చైర్మన్‌గా బాధ్యతలను కూడా నిర్వహించేవారు. అంతేకాకుండా.. వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు డైరెక్టర్‌గా కూడా రాకేష్ పని చేశారు. అలా దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరుగా దూసుకుపోయిన రాకేష్ జున్‌జున్‌వాలా 62 ఏళ్ల వయసులో 2022లో మరణించారు.ఇక రాకేష్ జున్‌జున్‌వాలా మరణించినప్పటికీ వారి వారి కుటుంబ పోర్ట్ ఫోలియోను చాలా మంది ఇప్పటికీ ఫాలో అవుతుంటారు. ఇకపోతే ప్రస్తుత వారి పెట్టుబడి బాధ్యతలను భార్య రేఖా చూసుకుంటున్నారు.ఇదిలా ఉంటే.. రాకేష్ జున్‌జున్‌వాలా ఉన్నప్పటి నుంచి వారి పెట్టుబడులు ఎక్కువగా టాటాలకు చెందిన టైటాన్ కంపెనీ షేర్లలో ఉండేవి. అయితే తాజాగా గతవారం చివరిలో టైటాన్ స్టాక్ తన మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది.

ఇక నేడు మార్కెట్ ప్రారంభం కాగానే టైటాన్ కంపెనీ షేర్లు ఏకంగా 5 శాతం నష్టానికి నమోదు అయ్యాయి. ఇక మార్కెట్ అంచనాల మేరకు నాలుగో త్రైమాసికంలో కంపెనీ అందుకోవటంలో విఫలం అవ్వటంతో స్టాక్ పతనానికి గురైంది. దీంతో రేఖా జున్‌జున్‌వాలాకు ఏకంగా నిమిషాల్లోనే రూ.805 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఆమె పెట్టుబడి సంపద వందల కోట్లలో తగ్గిపోయింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే..  మార్చి 31, 2024 నాటికి జున్‌జున్‌వాలా ఫ్యామిలీకి టైటాన్ కంపెనీలో 5.35 శాతం వాటాలు ఉన్నాయి. కాగా,  శుక్రవారం మార్కెట్లో టైటాన్ క్లోజింగ్ ప్రైస్ ప్రకారం.. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.16,792 కోట్లుగా ఉంది. అయితే  సోమవారం షేర్ ధర పతనం కారణంగా.. టైటాన్ మార్కెట్ క్యాప్ ఏకంగా శుక్రవారం ఉన్న రూ.3,13,868 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.2,98,815 కోట్లకు పడిపోయింది.  దీంతో నేడు ఇంట్రాడేలో టైటాన్ షేర్ ధర 5.18 శాతం మేర లాస్ తో  బీఎస్ఈలో ఒక్కోటి రూ.3,352.25కి పడిపోయింది.

అయితే టైటాన్ జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. జ్యూవెలరీ వ్యాపారంలో కొనసాగుతున్న కంపెనీ నికర లాభం, వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ.786 కోట్లకు చేరుకుంది.  ఈ క్రమంలోనే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 17 శాతం వృద్ధితో రూ.10,047 కోట్లుగా నమోదైంది. ఇకపోతే పసిడి, వెండి ధరలు మాత్రం విపరీతమైన పెరుగడంతో.. జ్యూవెలరీ వ్యాపార సంస్థలకు బలహినమైన డిమాండ్ , తీవ్రస్థాయిలో  వినియోగదారుల పోటీ, ఆఫర్ ల కారణంగా.. ఆభరణాల వ్యాపారం మార్జిన్‌లు తగ్గుదలకు దారితీసినట్లు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ అభిప్రాయపడింది. కానీ, కంపెనీ ఆభరణల వ్యాపారంలో దూకుడుగా ఉండేందుకులక్ష్యంగా చేసుకుంటుంది. ఇక ఈ ఫలితాల అంచనాలను అందుకోవటంలో..విఫలమైనప్పటికీ యాంటిక్ టైటాన్ షేర్లపై  BUY రేటింగ్ కొనసాగిస్తూ షేర్లకు రూ.4,017 టార్గెట్ ధరగా ప్రకటించింది. ఇది గతంలో ఇచ్చిన టార్గెట్ ధర రూ.4,100ను తగ్గించినట్లు తెలుస్తుంది. మరి, నిమిషాల వ్యవధిలో రేఖా జున్‌జున్‌వాలాకు ఏకంగా నిమిషాల్లోనే రూ.805 కోట్ల భారీ నష్టం వాటిల్లిడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments