Sunil Narine: నరైన్ నవ్వకపోవడానికి కారణం అదే.. అదొక మెరాకిల్: ఆండ్రీ రస్సెల్

Sunil Narine: నరైన్ నవ్వకపోవడానికి కారణం అదే.. అదొక మెరాకిల్: ఆండ్రీ రస్సెల్

KKR స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ చాలా అరుదుగా నవ్వుతూ ఉంటాడు. అయితే అతడు ఇతర క్రికెటర్లలా నవ్వకపోవడానికి కారణం చెప్పుకొచ్చాడు సహచర ఆటగాడు ఆండ్రీ రస్సెల్. ఇంతకీ ఆ రీజన్ ఏంటంటే?

KKR స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ చాలా అరుదుగా నవ్వుతూ ఉంటాడు. అయితే అతడు ఇతర క్రికెటర్లలా నవ్వకపోవడానికి కారణం చెప్పుకొచ్చాడు సహచర ఆటగాడు ఆండ్రీ రస్సెల్. ఇంతకీ ఆ రీజన్ ఏంటంటే?

సునీల్ నరైన్.. ఐపీఎల్ 2024 సీజన్ లో దుమ్మురేపుతున్న ఆటగాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా.. అతడిపైకి ఎదురుదాడి చేయడం ఒక్కటే నరైన్ కు తెలుసు. ఇక తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో సైతం తన విశ్వరూపాన్ని చూపాడు. కేవలం 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సులతో 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఈ స్టార్ ప్లేయర్. అయితే నరైన్ సెంచరీ చేసినా, వికెట్ తీసినా.. అతడు నవ్విన సందర్భాలు వేళ్లపై లెక్కించుకోవచ్చు. అసలు నరైన్ నవ్వడం మీరెప్పుడైనా చూశారా? అతడు నవ్వకపోవడానికి కారణం అదేనని తన సహచర ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ చెప్పుకొచ్చాడు. మరి ఈ విధ్వంసకర వీరుడు నవ్వకపోవడానికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేకేఆర్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ బౌలింగే కాదు.. అతడి వ్యక్తిత్వం కూడా ఎవ్వరికి అర్ధం కావడంలేదు. బ్యాట్ శివతాండవం ఆడుతున్నా.. బంతితో వికెట్లు తీస్తున్నా, తమ టీమ్ అద్భుత విజయాలు సాధిస్తున్నా.. అతడి మెుఖంలో ఎలాంటి భావవ్యక్తీకరణ ఉండదు. టీమ్ ఎలాంటి పరిస్థితితుల్లో ఉన్నా.. ఎప్పుడూ ఒకేతీరుగా ఉండటం నరైన్ స్పెషాలిటీ. అయితే అతడు నవ్వకపోవడానికి కారణం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేసింది కేకేఆర్ యాజమాన్యం. అందుకోసం ఫిల్ సాల్ట్, యంగ్ ప్లేయర్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్ తో చిట్ చాట్ జరిపింది. ఇందులో తెలిసిన విషయాలు ఏంటంటే?

నరైన్ సరదా ప్లేయర్ అని ఫిల్ సాల్ట్ చెప్పగా.. డ్రెస్సింగ్ రూమ్ లో నవ్వుతాడు అంటూ యంగ్ ప్లేయర్ రఘువంశీ తెలిపాడు. ఇక నరైన్ సహచర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ చెబుతూ..”నరైన్ నవ్వితే మాకూ చూడాలని ఉంది. కానీ అలా జరిగితే అదొక మెరాకిల్ అవుతుంది. 500 గేమ్ లు ఆడి అలసిపోయిన ఓ ఆటగాడు నవ్వడం కాస్త కష్టమైన పనే. అదికూడా సునీల్ నరైన్ లాంటి ఆటగాడికి ఇంకా కష్టమైన పని” అంటూ చెప్పుకొచ్చాడు రస్సెల్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే? ఆఖరికి డ్రెస్సింగ్ రూమ్ లో బెస్ట్ ఫర్పామెన్స్ అవార్డ్ తీసుకునేటప్పుడు కూడా నరైన్ నవ్వకపోవడం గమనార్హం. మరి సునీల్ నరైన్ నవ్వకపోవడం మీకేవిధంగా అనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments