Lunar Eclipse 2023 Temples To Close On Oct 28th: ఈ నెల 28న విజయవాడ, శ్రీశైల ఆలయాలు మూసివేత.. కారణమిదే

ఈ నెల 28న విజయవాడ, శ్రీశైల ఆలయాలు మూసివేత.. కారణమిదే

ఈనెల 28న విజయవాడ, శ్రీశైలం ఆలయాలు మూసి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు భక్తులు గమనించుకుని దర్శనానికి రావాలని కోరారు. మరి ఆలయాల మూసివేతకు కారణం ఏంటి అంటే..

ఈనెల 28న విజయవాడ, శ్రీశైలం ఆలయాలు మూసి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు భక్తులు గమనించుకుని దర్శనానికి రావాలని కోరారు. మరి ఆలయాల మూసివేతకు కారణం ఏంటి అంటే..

ఈ నెల 28న అనగా.. శనివారం నాడు విజయవాడ, శ్రీశైలం ఆలయాలు మూతపడనున్నాయి. ఆలయ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆలయాలు ముసివేతకు కారణం ఏంటి అంటే.. గ్రహణం. హిందూ సంప్రదాయంలో గ్రహణాలను చెడుగా పరిగణిస్తారు. గ్రహణం విడిచే వరకు కనీసం నీరు కూడా తాగరు. గ్రహణ సమయంలో ప్రసరించే కిరణాలు చెడు ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు. అందుకే ఆలయాలను సైతం మూసివేస్తారు. ఇక ఈ నెల 28న అనగా శనివారం నాడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.

ఈ క్రమంలోనే అక్టోబర్‌ 28న విజయవాడ, శ్రీశైల ఆలయాలను మూసి వేయనున్నారు. పాక్షిక చంద్రగ్రహాణాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. గ్రహణం విడిచిన తర్వాత అనగా ఈ నెల 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ తర్వాత 29న ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

అలానే చంద్రగ్రహణం కారణంగా శ్రీశైల ఆలయ ద్వారాలు 28న సాయంత్రం 5 గంటల నుంచి 29న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 29న ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు. 28న అన్నప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని..ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. భక్తులు ఈ సమాచారాన్ని తెలుసుకోవాలని.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా విజయవాడ, శ్రీశైలం ఆలయాలు మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాలన్నీ మూతపడనున్నాయి. ఈ నెల 28న సాయంత్రం నుంచి ఆలయాల తలుపులు మూసివేయనున్నారు. తిరిగి ఈ నెల 29న ఉదయం ఆలయాల తలుపులు తిరిగి తెరుచుకోనున్నాయి. అనంతరం సంప్రోక్షణ నిర్వహించి.. దర్శనాలకు భక్తుల్ని అనుమతిస్తారు.

Show comments