Shashank Praised Match Winner Prabhsimran Singh: బెయిర్​స్టో, శశాంక్​ను అందరూ మెచ్చుకుంటున్నారు.. కానీ రియల్ హీరోను మర్చిపోతున్నారు!

KKR vs PBKS: బెయిర్​స్టో, శశాంక్​ను అందరూ మెచ్చుకుంటున్నారు.. కానీ రియల్ హీరోను మర్చిపోతున్నారు!

కేకేఆర్​పై హైస్కోరింగ్ ఫైట్​లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ గెలుపుతో అందరూ బెయిర్​స్టో, శశాంక్ సింగ్​ను మెచ్చుకుంటున్నారు. కానీ మ్యాచ్​ను మలుపు తిప్పిన రియల్ హీరోను మాత్రం మర్చిపోతున్నారు.

కేకేఆర్​పై హైస్కోరింగ్ ఫైట్​లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ గెలుపుతో అందరూ బెయిర్​స్టో, శశాంక్ సింగ్​ను మెచ్చుకుంటున్నారు. కానీ మ్యాచ్​ను మలుపు తిప్పిన రియల్ హీరోను మాత్రం మర్చిపోతున్నారు.

ఐపీఎల్-2024లో మరో హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. దీనికి ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నిలిచింది. నిన్న కోల్​కతా నైట్ రైడర్స్​పై హైస్కోరింగ్ ఫైట్​లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది పంజాబ్ కింగ్స్. కేకేఆర్ సంధించిన 261 పరుగుల టార్గెట్​ను మరో 8 బంతులు మిగిలి ఉండగా ఛేజ్ చేసింది పంజాబ్. ఐపీఎల్​తో పాటు టీ20 క్రికెట్ హిస్టరీలో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. ఆ విధంగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అయితే ఈ గెలుపుతో అందరూ బెయిర్​స్టో, శశాంక్ సింగ్​ను మెచ్చుకుంటున్నారు. కానీ మ్యాచ్​ను మలుపు తిప్పిన రియల్ హీరోను మాత్రం మర్చిపోతున్నారు. అతడి వల్లే ఈ ఛేజింగ్ సాధ్యమైంది. కేకేఆర్ కొమ్ములు వంచడం వెనుక ఉన్న ఆ ప్లేయర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టార్గెట్ 261. 20 ఓవర్లలో ఛేజ్ చేయాలి. పంజాబ్ బ్యాటింగ్ యూనిట్ ఈ మధ్య పెద్దగా పెర్ఫార్మ్ చేయడం లేదు. శశాంక్ సింగ్ లాంటి ఒకరిద్దరు తప్పితే ఎవరూ ఫామ్​లో లేరు. దీంతో కోల్​కతా గెలుపు నల్లేరు మీద నడక అని అంతా అనుకున్నారు. కానీ ఊహించనిది చేసి చూపించింది పంజాబ్. అంత భారీ లక్ష్యాన్ని ఇంకో 8 బంతులు ఉండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉండగానే ఛేజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి ఎక్కువ క్రెడిట్ సెంచరీ బాదిన జానీ బెయిర్​స్టో (108 నాటౌట్), ఆఖర్లో వచ్చి మ్యాచ్​ను ఫినిష్​ చేసిన శశాంక్ సింగ్ (68 నాటౌట్) ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆడియెన్స్ కూడా వీళ్లిద్దర్నే మెచ్చుకుంటున్నారు. అయితే మ్యాచ్​ను పంజాబ్ వైపు తిప్పింది మాత్రం ప్రభుసిమ్రన్ సింగ్ అనే చెప్పాలి. 20 బంతుల్లోనే 54 పరుగులు చేశాడతను.

క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలు, సిక్సులు కొట్టడమే టార్గెట్​గా పెట్టుకొని చెలరేగిపోయాడు ప్రభుసిమ్రన్. 4 ఫోర్లు కొట్టిన ఈ యంగ్ బ్యాటర్.. 5 భారీ సిక్సులు బాదాడు. మరో ఓపెనర్ బెయిర్​స్టోతో కలసి ఫస్ట్ వికెట్​కు 6 ఓవర్లలోనే 93 పరుగులు జోడించాడతను. దుష్మంత చమీర, హర్షిత్ రాణా బౌలింగ్​ను టార్గెట్ చేసుకొని విధ్వంసం సృష్టించాడతను. ధనాధన్ షాట్లతో కేకేఆర్ బౌలర్లను బ్యాక్​సీట్​లోకి నెట్టాడతను. అతడు ఇచ్చిన క్విక్ స్టార్ట్ వల్లే పంజాబ్ స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్​తో దూసుకెళ్లింది. ఆ తర్వాత ప్రభుసిమ్రన్ ఔటైనా రీలీ రూసో (16 బంతుల్లో 26), శశాంక్ అండతో మ్యాచ్​ను ముగించాడు బెయిర్​స్టో. కాబట్టి శశాంక్, బెయిర్​స్టోకు ఇచ్చిన క్రెడిట్​లో ప్రభుసిమ్రన్​కు కూడా భాగం ఉందనే చెప్పాలి. మరి.. ప్రభుసిమ్రన్ ఇన్నింగ్స్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments