RCB vs GT: తనను అవుట్‌ చేసిన బౌలర్‌కు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన కోహ్లీ!

RCB vs GT: తనను అవుట్‌ చేసిన బౌలర్‌కు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన కోహ్లీ!

Virat Kohli, Noor Ahmad, RCB vs GT: ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ సూపర్‌ డూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. తన టీమ్‌ ఆర్సీబీ కూడా ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. అయితే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో తన వికెట్‌ తీసిన బౌలర్‌కు కోహ్లీ గిఫ్ట్‌ ఇచ్చాడు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

Virat Kohli, Noor Ahmad, RCB vs GT: ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ సూపర్‌ డూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. తన టీమ్‌ ఆర్సీబీ కూడా ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. అయితే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో తన వికెట్‌ తీసిన బౌలర్‌కు కోహ్లీ గిఫ్ట్‌ ఇచ్చాడు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ల్లో ఆర్సీబీ అదరగొడుతోంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌ జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ను కేవలం 147 పరుగులకే చుట్టేసిన ఆర్సీబీ.. 148 పరుగుల టార్గెట్‌ను కేవలం 13.4 ఓవర్లలోనే ఊదిపారేసింది. తొలుత ఆర్సీబీ బౌలర్ల ధాటికి మ్యాచ్‌ బెంగళూరులో జరుగుతుందా? లేక చెన్నైలోని చెపాక్‌లో జరుగుతుందా? అనే డౌట్‌ వచ్చింది. కానీ, ఆర్సీబీ ఓపెనర్లు బ్యాటింగ్‌ చేసిన విధానం చూసి.. బెంగళూరు పిచ్‌పై గుజరాత్‌ బ్యాటర్లు తేలిపోయారు అనే విషయం అర్థమైంది.

ఎందుకంటే.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే చిన్నస్వామి పిచ్‌పై కేవలం 147 పరుగులు మాత్రమే చేసింది జీటీ. అదే పిచ్‌పై కేవలం 6 ఓవర్లలో 92 రన్స్‌ చేశారు ఆర్సీబీ ఓపెనర్లు. డుప్లెసిస్‌ 23 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సులతో 64 పరుగులు చేసి అదరగొట్టాడు. అలాగే విరాట్‌ కోహ్లీ 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సులతో 42 పరుగులు చేసి రాణించాడు. కాగా, డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ ఐదో బంతికి అవుట్‌ అయిన తర్వాత ఆర్సీబీ ఇన్నింగ్స్‌ పేక మేడలా కూలిపోయింది. 92 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. 117 రన్స్‌ వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. డుప్లెసిస్‌.. తర్వాత విల్‌ జాక్స్‌, రజత్‌ పాటిదార్‌, మ్యాక్స్‌వెల్‌, కామెరున్‌ గ్రీన్‌.. ఇలా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయినా మరో ఎండ్‌లో కోహ్లీ ఉన్నాడని ఆర్సీబీ ఫ్యాన్స్‌ ధీమాతో ఉన్నారు.

కానీ, అదే వరుసలో గుజరాత్‌ బౌలర్‌ నూర్‌ అహ్మద్‌ అద్భుతమైన డెలవరీతో కోహ్లీని కూడా అవుట్‌ చేశాడు. అప్పటి వరకు సూపర్‌గా ఆడుతున్న కోహ్లీ.. వరుస వికెట్ల పడటంతో కాస్త ఒత్తిడికి గురై.. ఒక సూపర్‌ డెలవరీకి అవుట్‌ అయ్యాడు. అయితే.. మ్యాచ్‌ తర్వాత తనను అవుట్‌ చేసిన నూర్‌ అహ్మద్‌కు కోహ్లీ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. తన జెర్సీపై ‘డియర్‌ నూర్‌.. వెల్‌ బౌల్డ్‌, విష్‌ యూ ద బెస్ట్‌’ అని రాసి.. తన సంతకం చేసి నూర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ గిఫ్ట్‌తో నూర్‌ ఫుల్‌ ఖుషీ అయిపోయాడు. తన ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ క్రికెటర్‌ నుంచి జెర్సీ అందుకోవడంతో ఆ సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. మరి తన వికెట్‌ తీసిన బౌలర్‌కు కోహ్లీ ఏకంగా తన జెర్సీనే గిఫ్ట్‌గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments