భారత సంతతికి చెందిన వైద్యురాలికి ఎలెన్ మాస్క్ ఆర్ధిక సాయం!

భారత సంతతికి చెందిన వైద్యురాలికి ఎలెన్ మాస్క్ ఆర్ధిక సాయం!

Elon Musk: వ్యాపార రంగంలో దూసుకుపోతూ వరల్డ్ వైడ్ బిలినియర్ గా పేరు తెచ్చుకున్న మస్క్ తాజాగా చేసిన పనికి నెట్టింట అందరూ షాక్ గురవుతున్నారు. అంతేకాకుండా.. ఎలాన్ కు ఇలాంటి గుణం కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Elon Musk: వ్యాపార రంగంలో దూసుకుపోతూ వరల్డ్ వైడ్ బిలినియర్ గా పేరు తెచ్చుకున్న మస్క్ తాజాగా చేసిన పనికి నెట్టింట అందరూ షాక్ గురవుతున్నారు. అంతేకాకుండా.. ఎలాన్ కు ఇలాంటి గుణం కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఎలాన్ మస్క్.. వరల్డ్ వైడ్ గా ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ కూడా ఒకరు. అలాగే టెస్లా అధినేతగా, స్పేఎస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థలను ముందుండి నడిపిస్తూ.. భారీ ఆదాయన్ని సంపాదిస్తున్నారు. అలాగే వ్యాపార రంగంలో అంచనంచేలుగా ఎదుగుతూ.. ఎప్పటికప్పుడు ఆసక్తికర ట్వీట్లు చేయడం కొత్త పనులకు శ్రీకారం చూట్టడంలో ఎలాన్ మస్క్ ఎప్పుడు ముందంటారని సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వ్యాపార రంగంలో దూసుకుపోతూ వరల్డ్ వైడ్ బిలినియర్ గా పేరు తెచ్చుకున్న మస్క్ తాజాగా చేసిన పనికి నెట్టింట షాక్ గురవుతున్నారు. ఇక ఆయన చేసిన ఆ పనికి ఎలాన్ లో ఇలాంటి గుణం కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రపంచమంతా ఆ మహమ్మారి విజృంభణకు ఒక్కసారిగా స్తంభించిపోయింది. దీంతో అటు సామాన్య ప్రజలు మొదలు.. వ్యాపార వేత్తల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారి కష్టాలను చూసికెనడాలోని భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ ఎంతగానో చలించిపోయారు. వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కెనడియన్, అంటారియో ప్రభుత్వాల లాక్‌డౌన్‌, టీకా ఆదేశాలకు వ్యతిరేకంగా ట్విటర్‌ వేదికగా బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేసినంది. అలా చేసినందుకు గాను అటు వైద్యవర్గాలు, మీడియా కలిపి మొత్తం 23 మంది ఆమెపై కోర్టులో దావా వేశాయి. దీన్ని సవాల్‌ చేసిన కుల్విందర్‌ తనపై కుట్రపూరితంగా కేసులు పెట్టారంటూ కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెను తప్పుబడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటీషనర్ల తరపు లలీగల్‌ ఖర్చుల కింద మూడు లక్షల కెనడా డాలర్లు (సుమారు రూ.2కోట్లు) మార్చి 31లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టులో పోరాడేందుకు తాను సంపాదించిందంతా ఖర్చయిపోగా.. అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని కుల్విందర్ వాపోయారు. దీంతో అంత మొత్తం చెల్లించడానికి ఎవరైనా దాతలు డబ్బు సాయం చేయాలంటూ.. సోషల్‌ మీడియా వేదికగా ఆమె విజ్ఞప్తి చేసింది.

ఈ క్రమంలోనే ఆమెకు సాయం చేసేందుకు పలువురు దాతలతోపాటు.. ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ కూడా ముందుకు వచ్చారు. కాగా, మిగిలిన మొత్తం డబ్బును తాను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో.. ప్రంచ కుబేరుడైనా ఎలాన్ మస్క్ కు సంపాదించడమే కాదు.. సాయం చేయడం కూడా తెలుసంటూ ప్రశంశలతో ముంచేత్తుతున్నారు. మరి, ఎలాన్ మస్క్ భారత వైద్యురాలికి సాయం చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments