PPF: సూపర్ స్కీమ్.. రోజుకు 100 పొదుపు చేస్తే చాలు.. 10 లక్షలు చేతికి.. ఎలా అంటే?

సూపర్ స్కీమ్.. రోజుకు 100 పొదుపు చేస్తే చాలు.. 10 లక్షలు చేతికి.. ఎలా అంటే?

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఎందులో పెట్టుబడిపెడితే అధిక లాభాలు వస్తాయని ఆలోచిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ లో రోజుకు 100 చొప్పున పొదుపు చేస్తే రూ. 10 లక్షలు పొందొచ్చు.

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఎందులో పెట్టుబడిపెడితే అధిక లాభాలు వస్తాయని ఆలోచిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ లో రోజుకు 100 చొప్పున పొదుపు చేస్తే రూ. 10 లక్షలు పొందొచ్చు.

ప్రపంచమంతా డబ్బు వెనకాల పరుగెడుతోంది. డబ్బు సంపాదన కోసం మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి అధిక రాబడులు పొందుతున్నారు. అయితే ఇది రిస్క్ తో కూడుకున్న పని ఒక్కోసారి నష్టాలు రావొచ్చు.. ఉన్న ఆస్తులు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు అందుకోవచ్చు. గ్యారంటీ రిటర్న్స్ ఉండడం వల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే ఆ పథకంలో రోజుకు 100 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు 10 లక్షలు అందుకోవచ్చు.

సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే అది మీ భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. ఆకస్మికంగా వచ్చే ఆపదల నుంచి మీరు పొదుపు చేసిన డబ్బు కాపాడుతుంది. అయితే మనీ ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడిపెడితే సురక్షితమైన రాబడులను పొందొచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడులను అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ ను ప్రవేశపెట్టింది. బ్యాంకు, పోస్టాఫీసుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. ఆ పథకమే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఈ పథకంలో రోజుకు 100 చొప్పున పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయం వరకు మీరు 10 లక్షలు పొందొచ్చు.

పీపీఎఫ్ స్కీమ్ లో మీరు పెట్టే పెట్టుబడిని బట్టి రాబడి మారుతూ ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంది. లేదంటే స్థిరంగా కూడా ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్‌లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సంవత్సరానికి కనీసం రూ. 500 అయినా పెట్టుబడి పెడితే స్కీమ్ అకౌంట్ కొనసాగుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ 15 ఏళ్లు. అలాగే ఈ పథకంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది.

పీపీఎఫ్ పథకం ద్వారా 10 లక్షలు పొందాలంటే?

పీపీఎఫ్ పథకంలో రోజుకు 100 చొప్పున నెలకు మూడు వేలు పెట్టుబడి పెట్టాలి. అంటే మీరు ఏడాదికి 36 వేలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఈ విధంగా 15ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 15 ఏళ్లలో మీ పెట్టుబడి మొత్తం 5.4 లక్షలు అవుతుంది. ఈ పెట్టుబడి మొత్తంపై మీకు 4.4 లక్షల వడ్డీ వస్తుంది. పథకం మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడి, దానిపై వచ్చిన వడ్డీ కలుపుకుని మీకు రూ. 10 లక్షల వరకు చేతికి వస్తాయి. అధిక రాబడులు పొందాలనుకునే వారు ఈ పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మేలు అని నిపుణులు చెబుతున్నారు.

Show comments