Central Govt key decision on UPI Online Payments: ఆన్‌లైన్ పేమెంట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై తొలి UPI ట్రాన్సాక్షన్ కు 4 గంటల వ్యవధి!

ఆన్‌లైన్ పేమెంట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై తొలి UPI ట్రాన్సాక్షన్ కు 4 గంటల వ్యవధి!

ఆన్ లైన్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక లావాదేవీల ప్రక్రియ సులభతరం అయిపోయింది. ఉన్న చోటు నుంచే ఎప్పుడంటే అప్పుడు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. కాగా ఆన్ లైన్ పేమెంట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆన్ లైన్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక లావాదేవీల ప్రక్రియ సులభతరం అయిపోయింది. ఉన్న చోటు నుంచే ఎప్పుడంటే అప్పుడు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. కాగా ఆన్ లైన్ పేమెంట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం లావాదేవీలన్నీ ఆన్ లైన్ మోడ్ లోనే జరుగుతున్నాయి. చిన్న దుకాణాల దగ్గర్నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు కస్టమర్లు. బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండా ఉన్న చోటు నుంచే యూపీఐ సాయంతో ట్రాన్సాక్షన్స్ చేసేస్తున్నారు. కోట్లాది మంది యూపీఐ యూజర్లు ఆన్ లైన్ పేమెంట్లపైననే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ పేమెంట్ల పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై తొలి యూపీఐ ట్రాన్సాక్షన్ కు 4 గంటలు ఆగాల్సిందేనిని తెలుస్తోంది. సైబర్ మోసాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆన్ లైన్ పేమెంట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. అంతే స్థాయిలో సైబర్ మోసాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఫేక్ లింక్స్, ఓటీపీ, ఫేక్ మెసేజెస్ లతో సైబర్ క్రిమినల్స్ మోసాలకు తెగబడుతున్నారు. రోజుకో కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు ఖాతాదారుల అకౌంట్లను లూటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మోసాలను అరికట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు వెల్లడవుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్థాయి మొత్తానికి మించి జరిగే మొదటి ట్రాన్సాక్షన్ ను కొంత సమయం పాటు ఆపాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పేమెంట్ సమయంలో ఏదైన తప్పు జరిగితే ఆ ట్రాన్సాక్షన్ ను రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుందని దీనికి సంబంధించిన అధికారులు వెల్లడించినట్లు ఓ నేషనల్ పత్రిక నివేదించింది.

తొలి యూపీఐ ట్రాన్సాక్షన్ పూర్తయ్యేందుకు సుమారు 4 గంటల వ్యవధి ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. రిటైల్ ట్రాన్సాక్షన్లలో ఇబ్బంది లేకుండా రూ. 2 వేల కంటే ఎక్కువ మొత్తం చెల్లింపులకు మాత్రమే 4 గంటల వ్యవధి నిబంధన విధించాలని చూస్తున్నట్లు సమాచారం. గత పేమెంట్ హిస్టరీతో సంబంధం లేకుండా.. ఇద్దరి మధ్య జరిగే లావాదేవీలన్నింటికీ రూ. 2 వేలు దాటితే మాత్రమే 4 గంటల వ్యవధి నిబంధనలు వర్తింపజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్‌తో పాటు యూపీఐ చెల్లింపులకు కూడా ఈ కొత్త రూల్ అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్లకు ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉంది. కొత్తగా యూపీఐ అకౌంట్ తెరిచినప్పుడు మొదటి 24 గంటల్లో కేవలం రూ. 5 వేలు మాత్రమే చెల్లించే అవకాశముంది. ఇంకా నెఫ్ట్‌లో మొదటి 24 గంటల్లో రూ. 50 వేలు మాత్రమే పంపడానికి వీలుంది. కాగా కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం ఆన్ లైన్ పేమెంట్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. డిజిటల్ పేమెంట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి తొలి యూపీఐ ట్రాన్సాక్షన్ కు 4 గంటలు ఆగాల్సిందే అన్న నిబంధనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments