ఈ తెలుగమ్మాయిని గుర్తుపట్టారా? అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా

ఈ తెలుగమ్మాయిని గుర్తుపట్టారా? అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా

క్యూట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండే తెలుగమ్మాయిని బోల్డ్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసేశారు ఆ బాలీవుడ్డోళ్లు. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?

క్యూట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండే తెలుగమ్మాయిని బోల్డ్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసేశారు ఆ బాలీవుడ్డోళ్లు. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?

పై ఫోటోలో ఎంతో పద్ధతిగా తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి మన తెలుగమ్మాయే. హైదరాబాద్ లో పుట్టిన ఈ తెలుగమ్మాయి.. రెండు నెలల వయసప్పుడే తల్లిదండ్రులతో దుబాయ్ వెళ్ళిపోయింది. తండ్రి హిందీ మాట్లాడతారు. అమ్మ తెలుగామె. ఢిల్లీలో పెరిగింది. ఎన్ఐటీ వరంగల్ లో ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా ‘ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008’ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో ఆమె మొదటి రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత ‘మిస్ ఇండియా 2008’ పోటీలో పాల్గొని ఫైనలిస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో అక్కినేని హీరో సినిమాలోనూ, అలానే సందీప్ కిషన్ మూవీలో నటించే అవకాశం వచ్చింది.

ఆ అక్కినేని హీరోకి, సందీప్ కిషన్ కి ఇద్దరికీ హీరోలుగా మొదటి సినిమాలే అవి. ఈ సినిమాల తర్వాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఇమ్రాన్ హష్మీ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ది ఫ్యామిలీ మ్యాన్, ఏ వైరల్ వెడ్డింగ్, స్కామ్ 1992 సిరీస్ లతో బాగా పాపులర్ అయ్యింది. ఈమె ఫేడ్ టూ వైట్ అనే బుక్ ని రాసింది. 2020లో మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో 43వ స్థానంలో నిలిచింది. అయితే తెలుగు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ తెలుగమ్మాయి.. బాలీవుడ్ కి వెళ్ళాక పూర్తిగా మారిపోయింది. బోల్డ్ ఫోటోస్ తో ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కిస్తూ ఉంటుంది.

సెగలు రేపే పిక్స్ తో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.పైన ఫోటోలో ముగ్గు వేస్తూ కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఇప్పుడు.. తన బోల్డ్ నెస్ తో కుర్రాళ్ళని ముగ్గులోకి దించుతుంది. క్యూట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉండే ఆ హీరోయిన్ ఇప్పుడు బోల్డ్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయింది. ఇంకా గుర్తుపట్టలేదా? ఆమె పేరు శ్రేయా ధన్వంతరి. నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ నటించిన స్నేహగీతం సినిమాలో అలరించింది. ప్రస్తుతం అయితే అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరి ఇక్కడ ఉన్నప్పుడు పద్ధతికి పరికిణి, జాకెట్టు వేసినట్టు ఉన్న శ్రేయా ధన్వంతరి.. బాలీవుడ్ కెళ్ళాక బోల్డ్ గా మారడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments