హార్ధిక్‌ పాండ్యా లాంటి ప్లేయర్‌ టీమిండియాలో మరొకడు లేడు: మాజీ క్రికెటర్‌

హార్ధిక్‌ పాండ్యా లాంటి ప్లేయర్‌ టీమిండియాలో మరొకడు లేడు: మాజీ క్రికెటర్‌

Hardik Pandya, Tom Moody, IPL 2024: ప్రస్తుతం అందరూ హార్ధిక్‌ పాండ్యాను తిడుతుంటే.. ఓ దిగ్గజ క్రికెటర్‌ మాత్రం పాం‍డ్యాను వెనకేసుకొచ్చాడు. పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, Tom Moody, IPL 2024: ప్రస్తుతం అందరూ హార్ధిక్‌ పాండ్యాను తిడుతుంటే.. ఓ దిగ్గజ క్రికెటర్‌ మాత్రం పాం‍డ్యాను వెనకేసుకొచ్చాడు. పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే.. అతని ప్రదర్శనతో కాకుండా పలు విమర్శలు, వివాదలతోనే పాండ్యా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోపం ప్రకటించిన జట్టులో పాండ్యా పేరు ఉండటంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం హార్ధిక్‌ పాండ్యా చెత్త ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌లో కూడా పెద్దగా రాణించడం లేదు. బౌలర్‌గా కూడా విఫలం అవుతున్నాడు. అందుకే పాండ్యా ఎంపికపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి టైమ్‌లో ఓ దిగ్గజ క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. హార్ధిక్‌ పాండ్యా లాంటి ప్లేయర్‌ను టీమిండియాలో ఎవరున్నారో నాకు చూపించండి అంటూ గట్టి వ్యాఖ్యలే చేశాడు.

ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు హెడ్‌ కోచ్‌గా పనిచేసిన టామ్‌ మూడీ.. ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘హార్దిక్ పాండ్యా చేస్తున్న పనిని చేయగల మరో ముగ్గురు ప్లేయర్లు ఎవరున్నారో నాకు చెప్పండి. బ్యాటింగ్‌లో టాప్‌ 6లో చేసే, అలాగే నాలుగు ఓవర్ల పూర్తి కోటాను సమర్థవంతంగా పూర్తి చేయగల ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్‌ ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో చాలా అరుదుగా ఉన్నారంటూ మూడీ పేర్కొన్నాడు. నిజానికి పాండ్యా చాలా మంచి ఆల్‌రౌండరే కానీ.. తరచు గాయాలపాలవుతూ ఉంటాడు. ప్రస్తుతం ఫామ్‌లో కూడా లేడు అందుకే అతనిపై విమర్శలు వస్తున్నాయి. ఫామ్‌కి తోడు మరికొన్ని విషయాలు కూడా పాండ్యాపై క్రికెట్‌ అభిమానుల కోపానికి కారణమైంది.

ఐపీఎల్‌ 2022కి ముందు పాండ్యా ముంబై ఇండియన్స్‌లో కీలక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కానీ, ఐపీఎల్‌ 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌కు పాండ్యా కెప్టెన్‌గా వెళ్లిపోయాడు. తొలి సీజన్‌లోనే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. తర్వాత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది గుజరాత్‌. ఇంత మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్నా.. పాండ్యా గుజరాత్‌ను వీడి తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు. అతను వచ్చీ రావడంతోనే రోహిత్‌ శర్మ స్థానంలో పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇదే క్రికెట్‌ అభిమానుల కోపానికి ప్రధాన కారణం అయింది. ఆ తర్వాత తొలి మ్యాచ్‌లోనే రోహిత్‌ను బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌కు పంపడంతో పాండ్యాపై దారుణమై ట్రోలింగ్‌ జరిగింది. అది కొనసాగుతూనే ఉంది. ఇలాంటి టైమ్‌లో టామ్‌ మూడీ పాండ్యాకు మద్దతుగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments