Lahari Reveled Her Baby: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి లహరి!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి లహరి!

తెలుగు బుల్లితెరపై ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచిన నటి లహరి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చక్కటి చీరకట్టుతో ఎంతో సంప్రదాయంగా కనిపించిన లహరి చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చక్రవాకం, మొగలిరేకులు, ముద్దుబిడ్డ, ఇంటింటి గృహలక్ష్మి లాంటి హిట్ సీరియల్స్ లో నటించిన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తన సత్తా చాటింది లహరి. సీరియల్స్ లో బిజీగా ఉన్న సమయంలో వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత ఇండస్ట్రీకి కొంతకాలంగా విరామం ఇచ్చిన లహరి ‘ఓకే లహరి’ పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. తాజాగా ఓ క్రేజీ వార్త తన అభిమానులతో పంచుకుంది. వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై చక్రవాకం నుంచి గృహలక్ష్మి వంటి పలు హిట్ సీరియల్స్ లో నటించిన మంచి నటిగా పేరు తెచ్చుకుంది లహరి. సంప్రదాయబద్దంగా కనిపించే లహరి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వెండితెర, బుల్లితెరపై మంచి ఫామ్ లో ఉన్న లహరి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. ప్రస్తుతం తన నటనకు విరామం ఇచ్చిన లహరి అభిమానులతో సంతోషకరమైన వార్తను పంచుకుంది. గతంలో తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు ఆ మద్య తొమ్మిదవ నెల సీమంతం వేడుకలు కూడా ఘనంగా జరుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. లహరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బుల్లితెర నటీమణులు కలిసి ఈ వేడుకను ఘనంగా జరిపించారు.

బుల్లితెర నటి లహరి తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది. తనకు పండంటి మగబిడ్డ జన్మించాడని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు తాను ప్రసవించిన ఆస్పత్రిలోనే కేక్ కట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. లహరి పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు లహరి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం లహరి తన భర్త, కొడుకుతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments