BrahmaAnandam: తాత పాత్రలో 'బ్రహ్మానందం'.. కొడుకు గౌతమ్‌తో కలిసి మూవీ!

BrahmaAnandam: తాత పాత్రలో ‘బ్రహ్మానందం’.. కొడుకు గౌతమ్‌తో కలిసి మూవీ!

'హాస్య బ్రహ్మ' బ్రహ్మానందం ఓ సరికొత్త పాత్రతో ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నారు. ఇటీవలి కాలంలో సెలెక్టేగా సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించారు.

'హాస్య బ్రహ్మ' బ్రహ్మానందం ఓ సరికొత్త పాత్రతో ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నారు. ఇటీవలి కాలంలో సెలెక్టేగా సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కడుప్పుబ్బా నవ్విస్తున్నారు బ్రహ్మానందం. ఎన్నో వందల సినిమాలు చేసి.. ప్రేక్షకులను అలరించారు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మానందం లేని సినిమా అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవలి కాలంలో స్పీడ్ తగ్గించి.. తక్కువ సినిమాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆయనకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. త్వరలో కొడుకు గౌతమ్ తో కలిసి ఓ సినిమాను చేయనున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బ్రహ్మానందం.. ఈ పేరు చెప్పగానే, ఆ ఫేస్ చూడగానే ఆటోమెటిగా నవ్వు వస్తుంది. ఆ ముఖాన్ని అంతటి కళ ఉంది. ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. 90 దశకంలోని హీరోలో నుంచి నేటి తరం యంగ్ హీరోల వరకు అందరితో కలిసి పని చేసిన ఘనత బ్రహ్మానందానికే దక్కుతుంది. అలానే మూడు తరాల నటులతోనూ నటించిన అరుదైన ఘనత ఆయన సొంతం. అలా ఎన్నో వందల సినిమాల్లో నటించి..టాలీవుడ్ ఇండస్ట్రి చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. అలా సినీరంగంలో దూసుకెళ్తున్న బ్రహ్మానందం ఇటీవలి కాలంలో సినిమాలు తక్కువగానే చేస్తున్నారు. ముఖ్యంగా ఎంపిక చేసుకున్న మాత్రమే సినిమాలు చేస్తున్నారు.

తాజాగా తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మానందం ఓ మూవీలో నటిస్తున్నారని తెలుస్తోంది.. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ గతంలో మసూద సినిమాను నిర్మించింది. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజా గౌతమ్‌లు కలిసి చేసిన ఓ ప్రోమోతో ఈ మూవీని ప్రకటించింది. అయితే ఈ తండ్రికొడుకులు ఈ సినిమాలో తాత, మనవడిగా కనిపించనున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా ఈ మూవీలో నటిస్తున్నారు.

 ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న నిర్మిస్తున్నారు. శాండిల్య పిసపాటి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ 2024 డిసెంబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు తెలిపారు. సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభమవుతుంది. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బసంతి, మను అనే సినిమాల్లో నటించాడు. బ్రహ్మానందం కూడా ఇటీవలే ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇక ఈ తండ్రీకొడుకల సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show comments