iDreamPost

ప్రచారంలో పైత్యం.. యువతి బుగ్గపై ముద్దు పెట్టిన ఎంపీ అభ్యర్థి

  • Published Apr 10, 2024 | 4:53 PMUpdated Apr 10, 2024 | 4:53 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వివిధ పార్టీకి చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఇంటి ఇంటికి ప్రచారానికి తిరుగుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా బీజేపీకి పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ప్రచారం చేస్తూ ఓ యువతి పట్ల ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వివిధ పార్టీకి చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఇంటి ఇంటికి ప్రచారానికి తిరుగుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా బీజేపీకి పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ప్రచారం చేస్తూ ఓ యువతి పట్ల ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Apr 10, 2024 | 4:53 PMUpdated Apr 10, 2024 | 4:53 PM
ప్రచారంలో పైత్యం.. యువతి బుగ్గపై  ముద్దు పెట్టిన ఎంపీ అభ్యర్థి

ప్రస్తుతం దేశంలో లోక్ సభ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో.. పార్టీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. అలాగే ఈ ఎన్నికల్లో తాము గెలిపొందేందుకు రకరకాల విశ్వ ప్రయాత్నాలు చేస్తున్నారు,. ముఖ్యంగా ప్రజాలను ఆకర్షించేందుకు రకరకాల హామీలను ఇస్తూ తమని గెలిపించమని వేడుకుంటున్నారు. అసలే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. వివిధ పార్టీకి చెందిన అభ్యర్థులు.. ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారాలు నిర్వహించడం, రోడ్ షో లు వంటివి చేస్తూ జోరుగా తమ ప్రచారన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా బీజేపీకి పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ప్రచారం చేస్తూ ఓ యువతి పట్ల ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వివిధ పార్టీకి చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఇంటి ఇంటికి ప్రచారానికి తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి ఓ అభ్యర్థి కూడా ఇటీవలే ఓట్ల కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సమయంలోనే.. ప్రచారంలో భాగంగా.. రోడ్డుపై నిల్చున్న యువతికి ముద్దు పెట్టడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు దుమ్మెత్తుతున్నాయి. ఇంతకి ఆయన ఎవరంటే.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నార్త్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఖగేన్ ముర్ము. అయితే గతంలో ముర్ముూ మాల్టా నార్త్ నియోజకవర్గం ఎంపీగా ఉండగా.. మళ్లీ అదే నియోజకవర్గంలో.. బీజేపీ ఎంపీ గా ఖగేన్ ముర్మూ పోటీ చేస్తున్నారు. అయితే గత సోమవారం తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే.. రోడ్డు పై ఉన్న ఓ యువతి చెంప పై ముర్మూ ముద్దు పెట్టడంతో..ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. బీజేపీ పై పెద్ద ఎత్తునే విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇలా ఘటనలకు పాల్పడే బీజేపీ నేతలను వదలకూడదు అంటూ.. నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు.

అయితే ఈ వివాదం పై ఎంపీ ఖగేన్ ముర్మూ స్పందిస్తూ ఆ ఘటన పై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. ప్రచారంలో ముద్దు పెట్టిన ఆ యువతిని నేను నా సొంత కుమార్తెలా భావించి అలా చేశాను. అందులో తప్పేముంది ఇలాంటి ఘటనలకు సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిది చెడు మనస్తత్వం. ఆ ఫోటో తీసిన సమయంలో వాళ్ల అమ్మా నాన్న కూడా అక్కడే ఉన్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. మరి, ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనపై స్పందించి స్పష్టతనిచ్చిన ఎంపీ మాటాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి