Bangarraju : నాగార్జున నమ్మకం బ్రేక్ ఈవెన్ అయ్యేనా

Bangarraju : నాగార్జున నమ్మకం బ్రేక్ ఈవెన్ అయ్యేనా

సంక్రాంతికి చెప్పుకోదగ్గ పోటీ లేకుండా మల్టీ స్టారర్ గా విడుదలైన బంగార్రాజు అనూహ్యంగా నెమ్మదించింది. ఏపిలో సగం ఆక్యుపెన్సీ, సెకండ్ షోల రద్దు లాంటి కారణాలు ఉన్నప్పటికీ ఇటు నైజామ్ లోనూ అంతే స్థాయిలో డ్రాప్ కనిపిస్తోంది. ఇప్పటిదాకా రాబట్టిన షేర్ సుమారు 30 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ రిపోర్ట్. అంటే బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఇంకో పది కోట్ల దాకా రావాలి. ఈ శుక్రవారం కూడా చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడం బంగార్రాజుకు కలిసొచ్చే అంశం. కాకపోతే అఖండ తరహాలో మాస్ దీనికి బ్రహ్మరథం పట్టడం లేదు. పైపెచ్చు వాళ్లకు కనెక్ట్ అయిన దాఖలాలు కూడా అంతగా లేవు. కాబట్టే వీక్ డేస్ లో స్లో అయ్యింది.

ప్రమోషన్ల విషయంలో నాగ్ టీమ్ రాజీ పడలేదు. ఇటీవలే రాజమండ్రిలో గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్ చేశారు. మీడియాతోనూ రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంత చేసినా హౌస్ ఫుల్ బోర్డులు బాగా తగ్గిపోవడం అక్కినేని ఫాన్స్ ని టెన్షన్ కి గురి చేస్తోంది. తెలంగాణలోనూ కొద్దిపాటి నష్టాలు తప్పకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ వారాంతం అయ్యాక కానీ క్లారిటీ రాదు. మరోవైపు ఒమిక్రాన్ వల్ల ప్రాణాలు పోవడం లేదు కానీ జనంలో భయమైతే పెరిగింది. మునుపటిలా థియేటర్లకు రావడం లేదు. పూర్తిగా జీరో కాలేదు కానీ ఆశించిన స్థాయిలో టికెట్లు తెగని మాట వాస్తవం. హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి.

బంగార్రాజు తర్వాత కొత్త రిలీజులు పెద్దగా లేవు. రేపు ఉనికి, వర్మ, వధుకట్నం అనే చిన్న సినిమాలు క్యూలో పెట్టారు. వీటికి అడ్వాన్స్ బుకింగ్స్ జీరో అనే చెప్పాలి. వచ్చే నెల 4న రావాల్సిన ఆచార్య, ఈటిలతో పాటు ఈ రిపబ్లిక్ డేకి ప్లాన్ చేసుకున్న విశాల్ సామాన్యుడు సైతం వెనుకడుగు వేయడం ట్రేడ్ ని నిరాశపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగార్రాజుని ఓటిటిలో ఫిబ్రవరి 4కే జీ5లో విడుదల చేయొచ్చని టాక్ ఉంది. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. ఒకవేళ నిజమే అయితే ఆలోగా టార్గెట్ ఫినిష్ చేసుకుంటే బెటర్. అన్ని సానుకూలతలు ఉన్నా బంగార్రాజుకు కలెక్షన్ల విషయంలో ఇలా జరగడం విచిత్రమే

Also Read : Akhanda : ఇలాంటి పోస్టర్ చూసి ఎన్ని రోజులయ్యిందో

Show comments