రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. భారీగా పెరగనున్న భూముల ధరలు?

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. భారీగా పెరగనున్న భూముల ధరలు?

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే తెలంగాణలో భూములు ధరలు భారీగా పెరగనున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు సీఎం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే..

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే తెలంగాణలో భూములు ధరలు భారీగా పెరగనున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు సీఎం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతుంది. అంతేకాక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ.. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది. ఇప్పటికే పలు గ్యారెంటీలను అమలు చేయగా.. మిగతా వాటి అమలుకు చర్యలు తీసుకుంటుంది. ఓవైపు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. మరో వైపు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల తెలంగాణలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ వివరాలు..

రాష్ట్ర ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాడు సంబంధిత శాఖ అధికారులతో సచివాయలంలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ అమ్మకం, కొనుగోలు ధరలకు భారీ తేడా ఉందని అభిప్రాయపడ్డారు.

నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుందని.. ఆ క్రమంలో ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా.. భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని తెలిపారు. అంతేకాక స్టాంప్‌ డ్యూటీ తగ్గించడమా లేక పెంచడమా అన్న విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యాయనం చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలపై.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లకు నిర్మాణానికి వినియోగించే స్థలాల ధరలను సవరించాల్సిన ప్రాంతాలను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శాస్త్రీయంగా, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ నిబంధనల ప్రకారం ధరల సవరణను పాటించాలని తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు భూముల మార్కెట్ ధరలను సవరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అంతేకాక రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగంలో నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు.

Show comments