నాగ చైతన్య - వరుణ్ తేజ్ సినిమాల కు ప్రైమ్ వీడియో దెబ్బ?

నాగ చైతన్య – వరుణ్ తేజ్ సినిమాల కు ప్రైమ్ వీడియో దెబ్బ?

ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో వల్ల ఈ రెండు సినిమాలకి దెబ్బ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కథాంశాలకు చాలా దగ్గరగా ఉండే కంటెంట్‌ను ఈ ఓటీటీ సంస్థ తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో వల్ల ఈ రెండు సినిమాలకి దెబ్బ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కథాంశాలకు చాలా దగ్గరగా ఉండే కంటెంట్‌ను ఈ ఓటీటీ సంస్థ తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది.

యువ సామ్రాట్ నాగ చైతన్య తదుపరి చిత్రం తండేల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ తో పాటు చందూ మొండేటి దర్శకత్వం వహించడం, గీతా ఆర్ట్స్ వంటి ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాని నిర్మిస్తుండటం ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ఆసక్తిని పెంచింది. అలానే పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వరుణ్ తేజ్ మట్కా పై కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో వల్ల ఈ రెండు సినిమాలకి దెబ్బ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కథాంశాలకు చాలా దగ్గరగా ఉండే కంటెంట్‌ను ఈ ఓటీటీ సంస్థ తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న సత్య దేవ్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న అరేబియా కడలిలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రెండు ప్రత్యర్థి గ్రామాల నుండి వచ్చిన మత్స్యకారుల బృందం అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి విదేశీ జైలులో బంధింపబడే కథతో ఈ సినిమా/ సీరీస్ తెరకెక్కుతోంది. ఈ కథ చూస్తే నాగ చైతన్య తండేల్ గుర్తుకు వస్తుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ను మనం గమనిస్తే, అందులో కూడా హీరో పాకిస్తాన్ జైలులో ఖైదు చేయబడిన భారత జాలరిగా కనిపిస్తాడు. మరి దాదాపు ఇలాంటి కథాంశంతోనే అరేబియా కడలి ఎలా వస్తోందని పలువురు ఆశ్చర్యపోతున్నారు. ప్రైమ్ వీడియో నుంచి రానున్న మరో ఇంటరెస్టింగ్ కంటెంట్ మట్కా కింగ్‌. ఇందులో విజయ్ వర్మ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. పత్తి వ్యాపారి అయిన హీరో మట్కా గేమ్‌ను ప్రారంభించి దాన్ని ఒక మాఫియాగా ఎలా మారుస్తాడు అనే వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడుతుంది. వరుణ్ తేజ్ మట్కా కథ కూడా ఇదే తరహాలో శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ సెటప్‌లో తెరకెక్కుతుందని అంటున్నారు.

అరేబియా కడలి, మట్కా కింగ్ ల కథ తండేల్, మట్కా సినిమాల కథలకు దగ్గరగా ఉండటం ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలకు కాస్త ఇబ్బందిగా మారవచ్చు. ఒకవేళ ప్రైమ్ వీడియోలో ఆ సిరీస్‌లు ఈ సినిమాల కంటే ముందుగానే విడుదలైతే, అప్పుడు ప్రేక్షకులు ఖచ్చితంగా రెండిటినీ పోలుస్తారు. అదే గనక జరిగితే తండేల్, మట్కా సినిమాల బాక్సాఫీస్ ఫలితాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. మరి ముందుగా నాగ చైతన్య, వరుణ్ తేజ్ ల సినిమాలు విడుదలవుతాయా లేక ప్రైమ్ వీడియో సీరీస్ లు వస్తాయా అనేది చూడాలి.

Show comments