Train Ticket: రైలు టికెట్ కొన్నాక.. ఈ 6 ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. మీరు మిస్ అవ్వద్దు!

రైలు టికెట్ కొన్నాక.. ఈ 6 ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. మీరు మిస్ అవ్వద్దు!

Train Ticket: దేశంలో సుదూర ప్రయాణాలు చేసేవారు ట్రైన్ జర్నీ అంటే ఇష్టపడుతుంటారు. బస్సు కన్నా ట్రైన్ లో ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు రైలు టికెట్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Train Ticket: దేశంలో సుదూర ప్రయాణాలు చేసేవారు ట్రైన్ జర్నీ అంటే ఇష్టపడుతుంటారు. బస్సు కన్నా ట్రైన్ లో ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు రైలు టికెట్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

సాధారణంగా సుధూర ప్రయాణాలు చేసే వారు రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. రైలు ప్రయాణం సురక్షితమే కాదు.. ఎన్నో సదుపాయాలు ఉంటాయి. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు ఇతర పనులపై వెళ్లే వారు ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే రైలు టికెట్ ప్రయాణం మాత్రమే కాదు.. ఎన్నో భారీ ప్రయోజనాలు ఉన్న విషయం ఎవరికీ తెలియదు.. అవి ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

1. రైల్ లో ప్రయాణం చేసేవారికి దిండు, బెడ్ షీట్, బ్లాంకెట్ అన్ని Ac1,2,3 లలో ఉచితంగా లభిస్తాయి. గరీబ్ రథ్ లో కూడా ఈ సౌకర్యాలు ఉన్నాయి. మీరు ఏసీ లో ఈ సౌకర్యాలు పొందలకపోతే మీ టికెట్ ని చూపించడం ద్వారా మీరు వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

2. మీరు ధృవీకరించిన రైల్ టికెట్ కలిగి ఉంటే బస చేయడానికి హూటల్ అవసరమైతే మీరు IRCTC డార్మిటరీని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీకు బెడ్ తక్కువ రేటులో దొరుకుతుంది. అంటే రూ.150 వరకు ఉంటుంది.. ఇది 24 గంటలు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

3. మీరు రాజధాని, దురంతో లేదా శతాబ్ది వంటి ప్రీమియం రైల్ లో టికెట్ బుక్ చేసుకన్నట్లయితే 2 గంటల కన్నా ఎక్కువ ఆలస్యం అయితే మీకు IRCTC క్యాంటిన్ నుంచి ఉచితంగా ఆహారం అందించడం జరుగుతుంది. మీకు ఒకవేళ అలాంటి సదుపాయం ఇవ్వకపోతే వెంటనే 139 నంబర్ కు డయల్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవొచ్చు.

4. రైల్ ప్రయాణం చేసే సమయంలో మీకు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే మెడియల్ ఎమర్జెన్సీ ఉంటుంది. రైల్లోనే అన్ని ఫాస్ట్ ఎయిడ్ సౌకర్యం ఉంటుంది. మీకు ఇబ్బంది ఉన్న విషయం ఆర్పీఎఫ్ జవాన్ కి చెప్పాలి. లేదంటే 139 కి కాల్ చేయవొచ్చు. వెంటనే సిబ్బంది ప్రథమ చికిత్స చేస్తారు. ఒకవేళ మీకు కావాల్సిన సదుపాయం లేకుంటే తర్వాత వచ్చే స్టేషన్ లో చికిత్స చేస్తారు.

5. ప్రతి రైల్వే స్టేషన్ లో లాకర్, క్లోక్ రూమ్ సౌకర్యం ఉంటుంది. మీరు మీ వస్తువులను ఈ లాకర్ లో భద్రపర్చుకోవచ్చు. క్లోక్ రూమ్ లో సుమారు 1 నెల రోజుల పాటు ఉంచుకోవచ్చు. ఇందుకోసం మీరు 24 గంటలకు రూ.50 నుంచి రూ.100 వరకు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు రైలు టికెట్ తప్పని సరి కలిగి ఉండాలి.

6. మీరు రైల్ దిగిన వెంటనే లేదా ఎక్కే ముందు నాన్ ఏసీ లేదా ఏసీ వెయిటింగ్ రూమ్ లో రెస్ట్ తీసుకునే సదుపాయం ఉంటుంది. ఇందుకోసం మీ వద్ద రైల్ టికెట్ తప్పకుండా ఉండాలి. ఇక్కడ ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

రైలు ప్రయాణం చేసేవారికి ఇన్ని సదుపాయాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు.. మరి పైన తెలిపిన విషయాలు దృష్టిలో ఉంచుకొని హ్యాపీగా రైలు ప్రయాణం చేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments