OTT నెంబర్ వన్ ఎవరు..?

OTT నెంబర్ వన్ ఎవరు..?

  • Published - 01:15 PM, Wed - 9 November 22
OTT నెంబర్ వన్ ఎవరు..?

ఇప్పుడంతా ఓటిటి కాలం. ఒకప్పుడంటే థియేటర్లు మాత్రమే ఆప్షన్ గా ఉండేవి. తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. కొనేళ్లు విసిడి డివిడిలు రాజ్యమేలాయి. వాటి వైభవం పూర్తిగా తగ్గిపోయాక ఇప్పుడా స్థానాన్ని డిజిటల్ కంపెనీను ఆక్రమించుకుంటున్నాయి. వినియోగదారుడి సౌకర్యమే లక్ష్యంగా ఇంటికే ఎంటర్ టైన్మెంట్ తీసుకొస్తున్న వీటి తాకిడి ఏ స్థాయిలో ఉందంటే కొత్త సినిమాలతో మొదలుపెట్టి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ దాకా అన్నీ వీటిలో చూసేంతగా జనాలు అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ మయం. ఎక్కడా ఉన్నా ఫోర్ జి కనెక్షన్ ఉంటే చాలు లైవ్ లో ఆట సినిమాలో వినోదం ఈజీగా అందిపోతోంది కాబట్టే ఇంత ఆదరణ.

సహజంగా వీటిలో నెంబర్ వన్ ఎవరనే ఆసక్తి కలుగుతుంది. ఇటీవలే వెలువడిన గణాంకాల ప్రకారం డిస్నీ హాట్ స్టార్ ప్లస్ అగ్ర సింహాసనాన్ని ఆక్రమించుకుంది. 235 మిలియన్ల పెయిడ్ సబ్స్క్రైబర్స్ తో టాప్ వన్ రాంక్ ని సొంతం చేసుకుంది. వీటిలో అదే యాప్ లో భాగస్వామ్యం ఉన్న హులులో 47 మిలియన్లు, ఈఎస్పిఎన్ స్టార్ స్పోర్ట్స్ 24 మిలియన్లు ఉన్నారు. ఒక్క హాట్ స్టార్ మాత్రమే తీసుకుంటే దాని సోలో నెంబర్ 164. ఇంత భారీగా చందాదారులు పోగేసేందుకు నెట్ ఫ్లిక్స్ కు 12 సంవత్సరాల 8 నెలలు పడితే డిస్నీకి కేవలం 2 సంవత్సరాల 10 నెలలు పట్టింది. దీన్ని బట్టే గ్లోబల్ లీడర్ ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నెట్ ఫ్లిక్స్ ఉండగా మూడో ప్లేస్ తో అమెజాన్ ప్రైమ్ సర్దుకుంది. ఇక్కడ ప్రేక్షకులు అధికంగా ఆకర్షితులు అవుతోంది కంటెంట్ ప్లస్ ధరల మోడల్ పట్ల. నెట్ ఫ్లిక్స్ చాలా ఖరీదుగా మారిపోవడంతో మన ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపడం లేదు. పైగా టెలిగ్రామ్, టొరెంట్స్ తదితర రూపాల్లో విచ్చలవిడి పైరసీ అందుబాటులో ఉంది. ఒకవేళ ఇవి కనక లేకపోతే ఇక్కడ చెప్పిన ఓటిటిలన్నీ డబుల్ నెంబర్స్ తో అదరగొట్టేవన్న అంచనా కూడా ఉంది. మొత్తానికి థియేటర్ వ్యవస్థకు తీవ్రమైన పోటీ ఇస్తున్న డిజిటల్ విప్లవం రాబోయే ఫైవ్ జి టెక్నాలజీ తర్వాత ఇంకెన్ని మార్పులకు లోను కానుందో వేచి చూడాలి.

Show comments