OTT Suggestions- Best Love Story: OTTలో సూపర్ క్యూట్ లవ్ స్టోరీ.. ఇంత మంచి మూవీని ఎలా మిస్ అయ్యారు?

OTTలో సూపర్ క్యూట్ లవ్ స్టోరీ.. ఇంత మంచి మూవీని ఎలా మిస్ అయ్యారు?

OTT Suggestions: ఓటీటీలో చాలానే లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, ఇది మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. మీరు ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీని అసలు ఎలా మిస్ అయ్యారు?

OTT Suggestions: ఓటీటీలో చాలానే లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, ఇది మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. మీరు ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీని అసలు ఎలా మిస్ అయ్యారు?

ఇండస్ట్రీ ఏదైనా.. భాష ఏదైనా లవ్ స్టోరీ అనేది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. సినిమాల్లో లవ్ స్టోరీకి ఉండే క్రేజ్ మరో మూవీకి ఉండదు. పైగా క్యూట్ లవ్ స్టోరీ అయితే ఇంటిల్లిపాదితో థియేటర్ కి వెళ్లిపోతారు. అయితే అదంతా అప్పుడు.. ఇప్పుడు ఎక్కువ ఇంట్లో కూర్చుని ఓటీటీలో మంచి మంచి మూవీస్ చూసేందుకే ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. అలాంటి వారికోసం ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. నిజానికి ఇది వచ్చి చాలా రోజులు అవుతోంది. కానీ, చాలామంది ఓటీటీ ఆడియన్స్ కి ఈ మూవీ ఒకటి ఉంది అని కూడా తెలియదు. అందుకే మీకోసం ఒక మంచి క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీని సజీషన్ గా తీసుకొచ్చాం.

ఓటీటీలో ఇప్పటికే మీరు చాలా మంచి లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, ఇది మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. మీరు ఈ కథలో కొన్నిసార్లు మీ పాత్రను కూడా రిలేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇది ఒకరకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ఈ మూవీ పేరు ‘నిన్నిలా నిన్నిలా’. ఈ మూవీలో నిత్యా మీనన్, అశోక్ సెల్వన్, రీతూ వర్మ లీడ్ రోల్స్ ప్లే చేశారు. షెఫ్ అయ్యేందుకు దేవ్(అశోక్ సెల్వన్) లండన్ వెళ్తాడు. అక్కడ ఒక పేరు మోసిన రెస్టారెంట్ లో షెఫ్ గా ఉద్యోగం సాధిస్తాడు. అక్కడ నాజర్ హెడ్ షెఫ్ గా చేస్తుంటాడు. 15 ఏళ్లుగా అతను ఒక్క వంట వండలేదు.. ఒక వంటకాన్ని రుచి చూడలేదు.

కానీ, ఆ వంటకం బాగుందో లేదో వాసన చూసి చెప్పేస్తాడు. అలాంటి హెడ్ షెఫ్ దగ్గర దేవ్ మంచి మార్కులు కొట్టేస్తాడు. అయితే పక్కవాళ్ల వంటల్లో ఉప్పు, కారం ఎక్కువ వేసేసి తాను చేసిన వంటలు మాత్రమే రుచిగా ఉండేలా దేవ్ అందరినీ మోసం చేస్తుంటాడు. ముఖ్యంగా ఈ మూవీలో హీరోకి ఒక వింత జబ్బు ఉంటుంది. కాసేపటికి ఒకసారి ఒళ్లంతా విచిత్రంగా ఊగిపోతుంది. అతని శరీరం అతని కంట్రోల్ లో ఉండదు. ఈ జబ్బు వల్ల హీరో చేసే ఫన్ చాలా బాగుంటుంది. ఈ హీరోకి నిత్యా మీనన్ ఫ్రెండ్. రీతూవర్మ కూడా దేవ్ పనిచేసే రెస్టారెంట్ లోనే చేరుతుంది.

ఇలా ఈ ముగ్గురు జీవితాలు ఒక పాయింట్ దగ్గర ముడిపడతాయి.  ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగింది? దేవ్ ఎవరిని లవ్ చేస్తాడు? వారి లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే మీరు నిన్నిలా నిన్నిలా మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఈ నిన్నిలా నిన్నిలా మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. 2021లో వచ్చిన ఈ నిన్నిలా నిన్నిలా మూవీని చాలా తక్కువ మంది మాత్రమే చూశారు. మరి.. ఓటీటీలో ఉంది కదా.. మీరు ఓసారి చూసేయండి.

Show comments