Vijayendra Prasad On Jr NTR role In RRR Movie: RRR కథకి ఎన్టీఆర్‌ ది సపోర్టింగ్ రోల్! విజయేంద్ర ప్రసాద్ వీడియో వైరల్!

RRR కథకి ఎన్టీఆర్‌ ది సపోర్టింగ్ రోల్! విజయేంద్ర ప్రసాద్ వీడియో వైరల్!

Vijayendra Prasad On Tarak role In RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలోని తారక్ పాత్ర గురించి విజయేంద్ర ప్రసాద్ మరోసారి కామెంట్స్ చేశారు.

Vijayendra Prasad On Tarak role In RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలోని తారక్ పాత్ర గురించి విజయేంద్ర ప్రసాద్ మరోసారి కామెంట్స్ చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఒక అద్భుతమైన చిత్రం అది. వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులను అలరించడమే కాకుండా నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా తెచ్చిపెట్టింది. ఇంతటి గొప్ప చిత్రం విషయంలో విడుదలకు ముందు నుంచే ఒక చర్చ ఉండేది. ఎవరు పాత్రకు ప్రాధాన్యత, ఎవరిది మెయిన్ రోల్ అంటూ చాలానే చర్చలు జరిగాయి. తాజాగా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఆ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అసలు విజయేంద్ర ప్రసాద్ ఏం చెప్పారు? ఎన్టీఆర్ ది సపోర్టింగ్ రోలా? కాదా తెలుసుకుందాం.

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కి ముందే మల్టీ స్టారర్ అనే సరికి ఎవరు హీరో? ఎవరు సపోర్టింగ్ రోల్? అంటూ ప్రశ్నలు, చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. సినిమా రిలీజ్ తర్వాత రాజమౌళి ఈ వాదనకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో ఇద్దరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని వెల్లడించాడు. కొమురం భీముడో పాట తర్వాత గనుక మూవీని క్లోజ్ చేసుంటే ఎన్టీఆర్ పాత్ర హీరో అయ్యేదనే అభిప్రాయాన్ని తెలియజేశాడు. సినిమాలో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్, ఎలివేషన్స్, సీన్స్ ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా అప్పటి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా మరోసారి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

“మాకు రెండు పాత్రలు సమానమే. కథలో ఒక పాత్ర ఎక్కువ ఒక పాత్ర తక్కువ అనే భావన మాకు ఉండదు. అసలు అలా చేయాలి అని కూడా మేము అనుకోం. రెండు పాత్రలను సమానంగా అనుకునే రాశాం. కాకపోతే రామ్ చరణ్ పాత్రలో ఎక్కువ వేరియేషన్స్ కనిపిస్తాయి. కానీ, ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుంది. నిజానికి తారక్ చేసిన పాత్ర చేయడం చాలా కష్టం. కథ మొత్తానికి అది సపోర్టింగ్ పాత్ర. సినిమాని ముందుకు నడిపించడంలో ఆ పాత్ర సపోర్టింగ్ గా ఉంటుంది” అంటూ విజయేంద్ర ప్రసాద్ మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర గురించి వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అర్థం చేసుకుని ఎన్టీఆర్ ది సపోర్టింగ్ రోల్ అంటూ ప్రచారాలు మొదలు పెట్టారు. అయితే విజయేంద్ర ప్రసాద్ ఎక్కడా కూడా ఎన్టీఆర్ పాత్ర గురించి సపోర్టింగ్ రోల్ అంటూ ప్రస్తావించలేదు. కథకు సపోర్ట్ చేస్తూ.. ముందుకు నడిపించే పాత్ర అని క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ పాత్ర కథకు ఎంతో కీలకం అనే విషయాన్ని కూడా పునరుద్ఘాటించారు. అలాగే ఎన్టీఆర్ పాత్రను చేయడం ఎంత కష్టమో ఆయన మాటల్లోనే వెల్లడించారు. కాకపోతే ఎక్కువ వేరియేషన్స్ ఉండటం వల్ల రామ్ చరణ్ పాత్రను హీరోగా భావిస్తున్నట్లు ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Show comments