AP Elections 2024-CM Jagan: చెల్లెళ్ల ఆశ తీర్చేందుకు... ఇంకొకరికి అన్యాయం చేయడం ధర్మం కాదు: YS జగన్‌

CM Jagan: చెల్లెళ్ల ఆశ తీర్చేందుకు… ఇంకొకరికి అన్యాయం చేయడం ధర్మం కాదు: YS జగన్‌

ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలగు న్యూస్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలగు న్యూస్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

పేదల అభ్యన్నతే ఆయన ధ్యేయం.. సమాజంలోని బడుగు, బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందితేనే నిజమైన అని డెవలప్‌మెంట్‌ అని బలంగా నమ్మడమే కాక.. ఆచరణలో పాటించి చూపించే నిజమైన నేత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన అధికారంలో ఉన్న ఈ 58 నెలల కాలంలో సమాజంలో అన్ని వర్గాల వారి అభివృద్ధికి కృషి చేశారు. నగదు బదిలీ పథకాల ద్వారా సమాజంలో అన్ని వర్గాలు వారు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారు. నవరత్నాల పేరేతో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి.. అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం.. 99 శాతం హామీలను నెరవేర్చారు.

మరణించినా సరే ప్రజల గుండెల్లో చిరకాలం బతికి ఉండాలన్నదే జగన్‌ ఆశయం. పేదలకు మంచి చేసే విషయంలో ఎవ్వరి మాట వినరు. విశ్వసనీయత అనే బ్రాండ్‌నేమ్‌తో మరోసారి జనంలోకి వెళ్తున్నారు. ప్రత్యర్ధులంతా ఏకమైనా ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానేనంటూ ధీమాగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ తెలుగు మీడియా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్‌. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన స్పందించారు. దానిలో భాగంగా ఎన్నికల తరుణంలో తనపై ఆరోపణలు చేస్తోన్న వైఎస్‌ షర్మిల, సునీతలపై స్పందిస్తూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘‘చెల్లెళ్ల ఆశ, కోరిక తీర్చేందుకు ఇంకొకరికి అన్యాయం చేయడం ధర్మం కాదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే న్యాయం, ధర్మం అన్నది గైడింగ్‌ ఫ్యాక్టర్‌ కావాలి. రాష్ట్రంలో ఉన్న మిగతా అక్కచెల్లెమ్మలందరికి వాళ్ల జగన్‌.. వాళ్లకి ఏం చేశడు.. వాళ్లని ఏ రకంగా చూసుకున్నాడు అన్నది అందరికి తెలుసు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అంతేకాక బంధువులు, బంధుత్వాలు రాజకీయాల్లోకి వస్తే.. కుటుంబాల్లో కల్మషం వస్తుందన్నారు. కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవన్నారు. ఎన్నికలయ్యాక షర్మిల స్టాండ్‌ ఏంటో తెలుస్తుందన్నారు జగన్. ఒకే కుటుంబం నుంచి ఒకే తరం వాళ్లు రావడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Show comments