GMV OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది.. OTT లోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

GMV OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది.. OTT లోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఈ వీకెండ్ ఎంటర్టైన్ చేయడానికి.. నవ్విస్తూ భయపెట్టడానికి ఓ మంచి మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. అనుకున్న టైం కి అయితే రాలేదు కానీ.. కాస్త ఆలస్యంగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం..

ఈ వీకెండ్ ఎంటర్టైన్ చేయడానికి.. నవ్విస్తూ భయపెట్టడానికి ఓ మంచి మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. అనుకున్న టైం కి అయితే రాలేదు కానీ.. కాస్త ఆలస్యంగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం..

కొన్ని సార్లు అనుకున్న సమయానికి ఓటీటీ లోకి సినిమాలు రాకపోవచ్చు.. కాస్త ఆలస్యంగా ఆయా సినిమాలు ఓటీటీ లోకి వచ్చినా కానీ.. ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం ఏ మాత్రం తక్కువ చేయవు .. ఎప్పుడొచ్చామన్నది కాదు ఎంటర్టైన్ చేశామా లేదా అనేదే మ్యాటర్ అంటూ ఉంటాయి ఓటీటీ లోకి వచ్చే కొన్ని సినిమాలు. ఈ క్రమంలో మే 8 న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఒకటి అనుకున్న సమయానికి ఓటీటీ లోకి రాలేక పోయింది. దీనితో కాస్త అప్ సెట్ అయ్యారు ఓటీటీ లవర్స్. అయితే.. అనుకున్న టైం కి అయితే ఈ సినిమా రాలేదు కానీ.. అనౌన్స్ చేసిన రోజునే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. కాబట్టి ఈ వీకెండ్ అసలు మిస్ అవ్వకుండా ఈ సినిమాను చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు.. అంజలి ప్రధాన పాత్రలో నటించిన “గీతాంజలి మళ్లీ వచ్చింది“. ఈ సినిమాను మొదట మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్ . కానీ ఆ తర్వాత అనుకున్న దానికంటే రెండు రోజులు ముందు నుంచే ఈ సినిమాను ఆహ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే అది కూడా జరగలేదు. మే 8 నుంచి అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుందని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. కానీ ఈ సినిమా అదే రోజు కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీ లో ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో వేచి చూడాలి.

ఇక గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా కథేంటంటే.. ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి.. దర్శకుడిగా వరుసగా మూడు ప్లాపులు ఇవ్వడంతో.. అతనితో సినిమా చేసేందుకు నిర్మాతలు, హీరోలు ఎవరు కూడా అవకాశం ఇవ్వరు . దానితో ఖర్చులకు డబ్బుల కోసం తన స్నేహితుడిని మోసం చేస్తారు. కొంతకాలానికి అందరు తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అదే సమయానికి శ్రీనివాస్ కు.. ఓ సినిమా అవకాశం దొరుకుతుంది. అయితే ఆ ఆఫర్ ఇచ్చిన యజమాని.. తన కథతో సంగీత్ మహల్ లో షూటింగ్ చేయాలనే కండిషన్ ను పెడతాడు. దానికి సరే అని చెప్పి.. తన ఫ్రెండ్ అయిన అంజలి నే హీరోయిన్ గా చేసేందుకు ఒప్పిస్తాడు. అసలు సంగీత్ మహల్ లోనే ఎందుకు సినిమా చేయాలని అనుకుంటారు ! ఆ సంగీత్ మహల్ చరిత్ర ఏంటి ! అందులో అడుగుపెట్టిన తర్వాత అంజలి కి ఏమౌతుంది ! అక్కడకు ప్రవేశించిన ఆత్మ ఎవరిదీ ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments