Anjana Devi: వరుణ్ పెళ్లి కోసం.. అంజనమ్మ పెద్ద మనసు! ఏం చేసిందంటే?

వరుణ్ పెళ్లి కోసం.. అంజనమ్మ పెద్ద మనసు! ఏం చేసిందంటే?

  • Author ajaykrishna Updated - 04:25 PM, Tue - 31 October 23

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లికి ఇటలీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా హాజరై సందడి చేస్తున్న విజువల్స్ ఆల్రెడీ చూస్తున్నాం ఎం కానీ.. వరుణ్ నానమ్మ అంజనమ్మ ఈ పెళ్లికి వెళ్లలేకపోతున్నారట. దీంతో మనవడి పెళ్లి కోసం అంజనమ్మ పెద్ద మనసు చేసుకుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లికి ఇటలీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా హాజరై సందడి చేస్తున్న విజువల్స్ ఆల్రెడీ చూస్తున్నాం ఎం కానీ.. వరుణ్ నానమ్మ అంజనమ్మ ఈ పెళ్లికి వెళ్లలేకపోతున్నారట. దీంతో మనవడి పెళ్లి కోసం అంజనమ్మ పెద్ద మనసు చేసుకుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే..

  • Author ajaykrishna Updated - 04:25 PM, Tue - 31 October 23

ఎవరింట్లో పెళ్లి జరిగినా.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ హాజరవ్వాలని అనుకుంటారు. అన్ని అనుకున్నట్లుగా కుదరవుగా.. ఒక్కోసారి అనుకున్న వాళ్ళు హాజరు కాలేకపోవచ్చు. ఖచ్చితంగా కావాల్సిన వారు రాకపోతే బాధ ఎంతైనా ఉంటుంది. టెక్నాలజీ లేని కాలంలో బాధ పడేవారు. కానీ.. ఇప్పుడు అలా కాదు. మనిషి లేకపోయినా.. శుభాకార్యాలలో వర్చువల్ గా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. అవును.. ఇకపై అయినవాళ్లు పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కి రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లికి.. అంజనమ్మ వర్చువల్ గా అటెండ్ కాబోతుందట.

మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ అమ్మగారు అంజనా దేవి.. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించక ఎక్కడికి దూర ప్రయాణాలు చేసేందుకు సిద్ధంగా లేరట. జనరల్ గా పెళ్లి జరుగుతుందంటే.. ఆ పెళ్లిలో తాతలు, అమ్మమ్మ, నానమ్మల హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. మనవడు, మనవరాలి పెళ్లి చూడాలని ఎప్పటినుండో వెయిట్ చేస్తుంటారు గ్రాండ్ పేరెంట్స్. అయితే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి.. తన నానమ్మ అంజనమ్మ లేకుండానే జరగబోతుందట. మనవడి పెళ్లి కోసం అంజనమ్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఆ వివరాల్లోకి వెళ్తే.. తన పెద్ద కొడుకు మెగాస్టార్ చిరంజీవి పిల్లల పెళ్లిళ్లు దగ్గరుండి జరిపించింది అంజనమ్మ. ఇప్పుడు రెండో కొడుకు నాగబాబు తనయుడు, మనవడు వరుణ్ పెళ్లికి వెళ్లలేని పరిస్థితి నెలకొందట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి పరంగా.. దూర ప్రయాణాలు చేయకూడదని వైద్యులు సూచించారని తెలుస్తుంది. అందుకే.. ఆమె ఇప్పుడు ఇటలీలో జరగనున్న వరుణ్ – లావణ్యల పెళ్లికి వెళ్లలేకపోతున్నారట. ఎలాగో మనవడి పెళ్లి ప్రత్యక్షంగా చూడలేకపోయినా.. పెళ్లి లైవ్ లో చూసే వీలు కల్పిస్తున్నారట మెగాస్టార్. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారట. అలా మనవడు వరుణ్ ని ఆశీర్వదించనుంది అంజనమ్మ. మరి వరుణ్ పెళ్లి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments