Responsible Heroine: రూ.2 కోట్లు ఇస్తామన్నా ఆ యాడ్ లో నటించనన్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

రూ.2 కోట్లు ఇస్తామన్నా ఆ యాడ్ లో నటించనన్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

కొంచెం స్టార్ స్టేటస్ వస్తేనే ఏవేవో కంపెనీలకి ప్రకటనలు చేస్తున్నారు. అవి మంచివా? చెడ్డవా? అని ఆలోచించకుండా ప్రమోట్ చేసేస్తున్నారు. స్టాక్ మార్కెట్ అని, ట్రేడింగ్ యాప్స్ అని.. బెట్టింగ్ యాప్స్ అని ఇలా తమ ఫాలోవర్స్ ని వాటిలో పెట్టుబడి పెట్టమని ప్రమోట్ చేస్తున్నారు. ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కానీ ఈ విషయంలో సాయి పల్లవి విరుద్ధం.

కొంచెం స్టార్ స్టేటస్ వస్తేనే ఏవేవో కంపెనీలకి ప్రకటనలు చేస్తున్నారు. అవి మంచివా? చెడ్డవా? అని ఆలోచించకుండా ప్రమోట్ చేసేస్తున్నారు. స్టాక్ మార్కెట్ అని, ట్రేడింగ్ యాప్స్ అని.. బెట్టింగ్ యాప్స్ అని ఇలా తమ ఫాలోవర్స్ ని వాటిలో పెట్టుబడి పెట్టమని ప్రమోట్ చేస్తున్నారు. ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కానీ ఈ విషయంలో సాయి పల్లవి విరుద్ధం.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటూ ఉంటారు. ఈ మాట సినిమా ఇండస్ట్రీకి బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశం అనేది కొవ్వొత్తి లాంటిది. అది వెలుగుతున్నంత సేపు బానే ఉంటుంది. ఎప్పుడైతే కొవ్వొత్తి ఆరిపోతుందో సినిమా వాళ్ళ జీవితాలు కూడా చీకట్లోనే రాలిపోతుంటాయి. అయితే కొంతమంది సేఫ్ సైడ్ గా లైఫ్ కి సరిపడా ఎక్కువ కొవ్వొత్తులు బ్యాకప్ పెట్టుకుంటారు. దీని వల్ల వాళ్ళు ఛాన్సులు ఉన్నా లేకున్నా సేఫ్ గా ఉంటారు. అలా అని వచ్చిన అవకాశాలను మాత్రం వదులుకోరు. డబ్బులొస్తుంటే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. అందులోనూ ఒక్కరోజులో కోట్లు వస్తుంటే ఎవరైనా ఆగుతారా? ఒక సినిమా షూటింగ్ లో కనీసం ఒక 30 రోజులైనా పాల్గొంటేనే గానీ హీరోయిన్స్ కి 10 కోట్లు రావు. అలాంటిది ఒకే ఒక్కరోజు షూటింగ్ లో పాల్గొంటే రెండు, మూడు కోట్లు వస్తాయి.

స్టార్ హీరోయిన్స్ కి ఉన్న ఇమేజ్ అలాంటిది. ఒక 4 గంటలు యాడ్ లో నటిస్తే చాలు.. కోట్లు వచ్చి పడతాయి. కానీ ఈ స్టార్ హీరోయిన్ మాత్రం మిగతా హీరోయిన్స్ కి భిన్నం. రెండు కోట్లు ఇస్తాం.. యాడ్ చేసి పెట్టండి అంటే నేను చెయ్యా అని ముఖం మీదనే చెప్పేసింది. ఇంతకీ ఆ యాడ్ ఏంటో తెలుసా? ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్. ఈ ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు ఆ స్టార్ హీరోయిన్ ని కలిసి 2 కోట్లు ఆఫర్ చేశారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. ఎందుకు రిజెక్ట్ చేసిందో ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. తన చిన్నతనంలో నల్లగా ఉండే అబ్బాయిలతో తాను కనిపిస్తే.. నువ్వు చాలా తెల్లగా ఉన్నావు.. అని తనను పొగిడేవారట. అదే ఒక నల్లగా ఉన్న అమ్మాయితో ఒక తెల్లని అబ్బాయిని చూస్తే మాత్రం.. ఆ అబ్బాయిని మాయ చేసి బుట్టలో వేసుకుంది అని ఎగతాళి చేస్తారు.

చర్మం రంగుకి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే తాను ఈ యాడ్ ని తిరస్కరించానని చెప్పుకొచ్చింది. పైగా దాని వల్ల తెల్లగా అవుతారో లేదో కూడా తనకు తెలియదని.. తెలియనప్పుడు.. తాను ఆ క్రీమ్ వాడనప్పుడు.. ఎందుకు ప్రమోట్ చేయాలని తనను తాను ప్రశ్నించుకున్నానని చెప్పుకొచ్చింది. ఇది రాసుకుంటే అందంగా వస్తారు అని అబద్ధం చెప్పి తన ఫ్యాన్స్ ని మోసం చేయలేనని చెప్పుకొచ్చింది. ఎంత మంచి క్వాలిటీనో కదా. ఈ ఒక్కటే కాదు సాయి పల్లవిలో ఇలాంటి క్వాలిటీస్ చాలానే ఉన్నాయి. ఏదైనా సినిమా షూటింగ్ అయిపోయాక ప్రమోషన్స్ కి రమ్మంటే మిగతా వాళ్ళు సెపరేట్ గా ఛార్జ్ చేస్తారు. కానీ సాయి పల్లవి అలా కాదు. మొదట్లో తీసుకున్న పారితోషికంతోనే సరిపెట్టుకుంటుంది. అంత మంచి పిల్ల. అందుకే అందరికీ బాగా నచ్చుతుంది. మరి సాయి పల్లవి మంచి మనసుపై, మంచి వ్యక్తిత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments