Parshottam Rupala Gets Stuck In Chilika Lake:: కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం.. ఏమాత్రం ఆలస్యం అయినా..

కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం.. ఏమాత్రం ఆలస్యం అయినా..

Parshottam Rupala Gets Stuck In Chilika Lake: మనిషికి ప్రమాదాలు అనేవి ఎలా వస్తాయో.. ఏ రూపూంలో వస్తాయో ఎవరూ ఊహించలేరు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల, అగ్ని ప్రమాదాలు ఇలా ఎన్నో రకాల ప్రమాదాల్లో చిక్కుకొని కొంతమంది మృత్యువాత పడుతున్నారు.. కొంతమంది అదృష్టం కొద్ది బతికి బయటపడుతున్నారు.

Parshottam Rupala Gets Stuck In Chilika Lake: మనిషికి ప్రమాదాలు అనేవి ఎలా వస్తాయో.. ఏ రూపూంలో వస్తాయో ఎవరూ ఊహించలేరు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల, అగ్ని ప్రమాదాలు ఇలా ఎన్నో రకాల ప్రమాదాల్లో చిక్కుకొని కొంతమంది మృత్యువాత పడుతున్నారు.. కొంతమంది అదృష్టం కొద్ది బతికి బయటపడుతున్నారు.

ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, కరెంట్ షాక్ ఇలా ఎన్నో రకాలుగా మృత్యువ ప్రమాద రూపాల్లో కబలిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, క్రీడా కారులు కొన్నిసార్లు ప్రమాదాల్లో చిక్కుకొని అదృష్టం కొద్ది బయట పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఘటన కేంద్ర మంత్రికి ఎదురైంది. ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపడా వరకు సరస్సు మీదుగా ప్రయాణిస్తున్న మంత్రి అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడంతో వ్యక్తిత సిబ్బంది, అధికారులు అలర్ట్ అయి రక్షించారు. వివరాల్లోకి వెళితే..

కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ సహాయ మంత్రి పర్షోత్తం రూపాలా, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రతో పాటు మరికొందరు ఒడిశాలోని చిలికా సరస్సుపై ఆదివారం రెండు గంటలకు పైగా చిక్కుకుపోయారు. దీంతో అధికారులు అలర్ట్ అయి మరో పడవను అక్కడికి పంపించి రక్షించారు. అసలు ఏం జరిగిందంటే.. ఆదివారం, ఖోర్ధా జిల్లాలోని బలుగావ్‌లోని బార్కుల వద్ద ఒడిశా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (OTDC) అతిథి గృహం నుండి కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలాతో సంబిత్ పాత్ర మరికొంత మందిని తీసుకుని రెండు పడవలు బ్రహ్మగిరి బ్లాక్‌లోని అరఖకుడలో సాగర్ పరిక్రమ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సతపదా వైపు వెళ్తున్నాయి. చీకటి పడటంతో కొత్త దారిలో వేళ్లే ప్రయత్నం చేసి దారి తప్పారు. చిలికా సరస్సు మధ్య నలబానా పక్షుల అభయారణ్యం సమీపంలో మంత్రి ప్రయాణిస్తున్న పడవ రెండు గంటల సేపు చిక్కుకు పోయింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి మరో పడవను పంపించారు. మొత్తానికి మంత్రి సహ ఇతర నేతలు, కార్యకర్తలు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

కేంద్ర మంత్రి నదిలో చిక్కుకున్నారన్న వార్త తెలియగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ లు వచ్చాయి. ఈ సందర్బంగా మంత్రి పర్షోత్తం రూపాలా మాట్లాడుతూ.. ‘ 11వ దశ ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులతో సమావేశం అయ్యేందుక ఒడిశా పర్యలనకు వచ్చాం.. పూరీ జిల్లాలోని సతపదాకు పడవలో బయలుదేరాం.. అయితే మా పడవ నడిపే వ్యక్తి కొత్త మార్గంలో వెళ్లడంతో దారి తప్పాం.. సతపత చేరుకోవడానికి మాకు దాదాపు రెండు గంటలు ఎక్కువ సమయంల పట్టింది.’అని అన్నారు. అయితే పూరి జిల్లాలోని కృష్ణ ప్రసాద్ ఏరియాలో జరిగాల్సిన కార్యక్రమం మంత్రి హాజరు కావాల్సి ఉండగా.. ఈ ఘటన కారణంగా రద్దయ్యింది. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Show comments