DC vs RR Yuzvendra Chahal Complete 350 Wickets: చాహల్ క్రేజీ ఫీట్.. టీ20 క్రికెట్ హిస్టరీలో తొలి భారత బౌలర్​గా రికార్డు!

DC vs RR: చాహల్ క్రేజీ ఫీట్.. టీ20 క్రికెట్ హిస్టరీలో తొలి భారత బౌలర్​గా రికార్డు!

సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ క్రేజీ ఫీట్ నమోదు చేశాడు. ఇన్నేళ్ల టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్​గా నిలిచాడు.

సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ క్రేజీ ఫీట్ నమోదు చేశాడు. ఇన్నేళ్ల టీ20 క్రికెట్ హిస్టరీలో ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్​గా నిలిచాడు.

టేబుల్ టాపర్ రాజస్థాన్​ రాయల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. సింగిల్స్, డబుల్స్ కాకుండా ఆ టీమ్ బ్యాటర్లు పూనకం వచ్చినట్లు బౌండరీలు, సిక్సులను బాదుతూ రెచ్చిపోతున్నారు. జేక్ ఫ్రేజర్ మెక్​గర్క్ (20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65), ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) రాజస్థాన్ బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరును అలవోకగా 200 దాటించారు. అయితే ఈ మ్యాచ్​లో స్పిన్నర్లు రాణించారు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ మ్యాచ్​తో చరిత్ర సృష్టించాడు.

డిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో చాహల్ క్రేజీ ఫీట్ నమోదు చేశాడు. ఇన్నేళ్ల టీ20 క్రికెట్ హిస్టరీలో ఏ భారత బౌలర్​కు సాధ్యం కాని ఘనతను అతడు అందుకున్నాడు. డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ (15)ను ఔట్ చేసిన చాహల్.. తద్వారా 350 వికెట్ల క్లబ్​లోకి అడుగుపెట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు తీసిన తొలి టీమిండియా బౌలర్ చాహలే కావడం విశేషం. తోపు బౌలర్ అయిన జస్​ప్రీత్ బుమ్రా, వెటరన్ స్పిన్నర్ అశ్విన్ వల్ల కూడా ఇది కాలేదు. కానీ చాహల్ దీన్ని సాధించి చూపించాడు. దీన్ని బట్టే పొట్టి ఫార్మాట్​లో అతడి గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఢిల్లీ అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్లకు 221 పరుగులు చేసింది.

Show comments