నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు.. అసలేమైందంటే..?

నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు.. అసలేమైందంటే..?

  • Published - 10:45 AM, Fri - 4 November 22
నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు.. అసలేమైందంటే..?

మొన్న వాట్సాప్‌ సేవలు నిన్న ఇన్ స్టాలో ఏర్పడిన అసౌకర్యం కారణంగా కొంత సమయం వరకు సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. అయితే తాజాగా ఈ జాబితాలోకి ట్విట్టర్‌ కూడా వచ్చింది. నేడు అనగా శుక్రవారం ట్విట్టర్‌ సేవల్లో అంతరారయం ఏర్పడింది.

కొంత మంది యూజర్లు తమకు ట్విట్టర్‌ సేవలు నిలిచిపోయాయని వాపోతున్నారు. లాగిన్‌ అవుతోన్న సందర్భంలో ‘సమ్‌థింగ్‌ వెంట్ రాంగ్‌’ అనే ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తోందని పేర్కొంటున్నారు.

అయితే ఈ అసౌకర్యం కేవలం వెబ్‌ యూజర్లకు మాత్రమే కలిగినట్లు తెలుస్తోంది. మొబైల్‌ ఫోన్స్‌లో ట్విట్టర్‌ యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి సేవలు యధావిధిగా కొనసాగుతున్నాయని సమాచారం. కేవలం కంప్యూటర్స్‌లో ఆపరేట్‌ చేసే వారికే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇలాంటి సమస్య ఎదురైన విషయం తెలిసిందే. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత కీలక మార్పులు జరుగుతున్న విషయం తెలిసిదే. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడం గమనార్హం.

ఇదిలా ఉంటే ఏమంటూ ఎలాన్ మస్క్ వాట్సాప్ ను హస్తగతం చేసుకున్నాడో అనేక మార్పులకు శ్రీకారం నంది పలికారు. ఇప్పటి వరకు ఉచితంగా ఉన్న బ్లూ టిక్ ఆప్షన్ ను పెయిడ్ గా మార్చారు. ఇకపై బ్లూ టిక్ పొందాలనుకునే వారు నెలకు 8 డాలర్లు చెల్లించాలని తెలిపారు. ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ట్విట్టర్ లో ప్రక్షాళన మొదలు పెట్టిన మస్క్.. భారీగా ఉద్యోగులను కూడా తొలగించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Show comments