TTD-Rathasapthami 2024: తిరుమల అలర్ట్‌.. ఈ నెలలో వారికి ఆ ఒక్కరోజు దర్శనాలు ఉండవు

TTD: తిరుమల అలర్ట్‌.. ఈ నెలలో వారికి ఆ ఒక్కరోజు దర్శనాలు ఉండవు

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఆ ఒక్క రోజు వారికి దర్శనాలు ఉండవని చెప్పింది. ఆ వివరాలు..

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఆ ఒక్క రోజు వారికి దర్శనాలు ఉండవని చెప్పింది. ఆ వివరాలు..

తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు టీటీడీ అలర్ట్‌ జారీ చేసింది. మూడు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలానే ఆ ఒక్క ర ఓజు వారికి దర్శనలు ఉండవు అని చెప్పింది.  ఆ వివరాలు.. ఫిబ్రవరి 16న సూర్య జయంతిని పురసక్కరించుకుని జరిగే రథసప్తమికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎండలు మండుతుండటంతో.. రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలా వారి కోసం జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేశారు. అలానే శ్రీవారి ఆలయ మాడవీధుల్లో రంగవల్లలు తీర్చిదిద్దుతున్నారు. అంతేకాక ఆరోజు బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాధిపతులతోనూ సమావేశాలు ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రథసప్తమి సందర్భంగా.. నాడు ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంలో నిర్వహిస్తారు. ఇదే కాక ఈ సందర్భంగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్‌ స్లాట్‌ దర్శన టోకెన్లు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. అలానే రథసప్తమి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం 3.5 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. వాహన సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రకటించారు.

రథసప్తమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే వాహన సేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదం అందజేయనున్నారు. భక్తులకు సాంబారు అన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలతో పాటు.. తాగునీరు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. రథసప్తమి రోజు రద్దీ ఉంటుందనే అంచనాతో.. ప్రత్యేక దర్శనాలు (వీఐపీ బ్రేక్‌, వయోవృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు) ను కూడా రద్దు చేశారు.

Show comments