TS Inter Results: బాల్య వివాహాన్ని ఎదిరించి.. విజేతగా నిలిచి.. తల్లిదండ్రులకు పేరు తెచ్చింది

బాల్య వివాహాన్ని ఎదిరించి.. విజేతగా నిలిచి.. తల్లిదండ్రులకు పేరు తెచ్చింది

ఆడ పిల్ల ఇంటికి భారం అనే కుటుంబంలో జన్మించింది. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు ఎదురైనప్పటికీ మెరిట్ విద్యార్థిగా రాణిస్తుంది. కానీ 14 ఏళ్లకే ఆమెకు పెళ్లి చేసేయాలనుకున్నారు. కానీ ఆ వయస్సులో ఎంతో ధైర్యంతో..

ఆడ పిల్ల ఇంటికి భారం అనే కుటుంబంలో జన్మించింది. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు ఎదురైనప్పటికీ మెరిట్ విద్యార్థిగా రాణిస్తుంది. కానీ 14 ఏళ్లకే ఆమెకు పెళ్లి చేసేయాలనుకున్నారు. కానీ ఆ వయస్సులో ఎంతో ధైర్యంతో..

‘పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా’అని ఓ సినీ రచయిత అక్షరాలు.. జీవిత సత్యాలు. చదువుకోవాలన్న జిజ్ఞాస ఉండాలే కానీ.. అనారోగ్యం, అంగవైకల్యం అడ్డురావు అని నిరూపించారు కొంత మంది ఇంటర్, పదో తరగతి విద్యార్థులు. పేదరికంలో పుట్టి, ప్రభుత్వ బడులు, కాలేజీల్లో చదువుతూ మంచి మార్కులు సాధిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు నిజంగా సరస్వతి పుత్రికలే. సమాజంలో ఉన్న సవాళ్లను ఎదుర్కొని మరీ.. చదువుల్లో రాణిస్తున్నారు. ఈడొస్తే చాలు అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలని ఆలోచిస్తున్న తమ తల్లిదండ్రులను ఎదిరించి మరీ చదువుకుని పాస్ కావడమే కాదు.. ర్యాంకర్లుగా నిలుస్తున్నారు.

కర్నూల్ జిల్లా ఆదోనీ మండలానికి చెందిన నిర్మల బాల్య వివాహాన్ని ఎదిరించి.. చదువే ముఖ్యమని భావించి.. ఇంటర్‌లో జాయిన్ అయ్యింది. ఇటీవల ఏపీ ఇంటర్మీడియట్ విడుదల చేసిన ఫలితాల్లో బైపీసీలో తొలి ర్యాంక్ సాధించింది. ఆమెకు ఫస్ట్ ఇయర్ లో 440కి గానూ 421 మార్కులు వచ్చిన సంగతి విదితమే. ఇప్పుడు మరో అమ్మాయి.. చైల్డ్ మ్యారేజ్ అడ్డుకుని.. తెలంగాణ ఫలితాల్లో నాలుగో ర్యాంకర్‌గా నిలిచింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన బానోతు కుసుమ కుమారి.. ఆడ పిల్ల పుడితేనే భారం అని భావించే కుటుంబంలో పుట్టింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ పరిస్థితులు సహకరించకపోయినా బాగా చదివేది. కానీ ఆమెకు పద్నాలుగేళ్లకే పెళ్లి చేసేయాలని అనుకున్నారు తల్లిదండ్రులు.

చదువుకుంటాను అని చెప్పినా.. వినిపించుకోకుండా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఆ వయస్సులో ఎంతో ధైర్యంతో ముందడుగు వేసింది. ఈ పెళ్లి ఆపేయాలన్న ఉద్దేశంతో 1098కి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న ఐసీడీఎస్, చైల్డ్ లైన్ సభ్యులు ఆ పెళ్లిని నిలిపేశారు. తనకు బాగా చదువుకోవాలని ఉందని, నర్సు అవుతానని చెప్పడంతో మణుగూరులోని చిల్ట్రన్స్ హోమ్‌కు పంపించారు. ఆ తర్వాత ములకపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యా సంస్థ (కేజీబీవీ)ల్లో చేర్పించారు. వేసవి సెలవుల్లో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని చిల్డ్రన్ హోంలో, పని దినాల్లో కళాశాల హాస్టల్లో ఉంటూనే ఇంటర్ చదివింది. ఇటీవల విడదుల చేసిన ఫలితాల్లో 978 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నాల్గవ స్థానంలో నిలించింది. అలాగే కేజీబీవీ కళాశాల పరిధిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. అంతేకాదు.. పెళ్లి చేసి భారం దించుకుందామనుకున్న తల్లిదండ్రులకు పేరు తెచ్చింది. ఊరి పేరు నిలబెట్టింది కుసుమ కుమారి.

Show comments