Swetha
మార్చి నెల అయిపోతుంది .. ఇక ఆ తర్వాత వచ్చేది ఏప్రిల్. ఏప్రిల్ 1వ తేదీ అంటే అందరికి బాగా గుర్తొచ్చేది ఫూల్స్ డే. ముఖ్యంగా చిన్నతనంలో ప్రతి ఒక్కరు ఏప్రిల్ ఫూల్ అంటూ సరదాగా సెలెబ్రేట్ చేసుకుని ఉంటారు. మరి దాని వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందో ఆలోచించారా!
మార్చి నెల అయిపోతుంది .. ఇక ఆ తర్వాత వచ్చేది ఏప్రిల్. ఏప్రిల్ 1వ తేదీ అంటే అందరికి బాగా గుర్తొచ్చేది ఫూల్స్ డే. ముఖ్యంగా చిన్నతనంలో ప్రతి ఒక్కరు ఏప్రిల్ ఫూల్ అంటూ సరదాగా సెలెబ్రేట్ చేసుకుని ఉంటారు. మరి దాని వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందో ఆలోచించారా!
Swetha
ఏప్రిల్ 1వ తేదీ అనగానే అందరికి భలే సరదాగా అనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు అందరు ఏప్రిల్ వచ్చిందంటే సంబరపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే గా సెలెబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా స్కూల్స్ లో చిన్నపిల్లలు, కాలేజీలలో యువతి యువకులు.. షూ లేస్ ఊడిపోయిందనో.. డ్రెస్ పై ఇంక్ పడిందనో.. లేదా ఒకరిపై ఒకరు కట్టు కథలు చెప్పుకోవడం .. ఇలా అందరూ సరదా ప్రాంక్ చేసుకుంటూ.. జోకులు వేసుకుంటూ.. ఫన్నీగా జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలా ఫూల్ చేయాలా అని ప్లాన్ చేస్తుంటే.. మరి కొంతమంది ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మొత్తానికి ఏప్రిల్ 1వ తేదీ అంటే అందరికి ఎక్సయిటింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు కోసం అయితే అందరు ఎదురుచూస్తారు.. కానీ, దీనిని సెలెబ్రేట్ చేసుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయి! అసలు దీనిని ఎప్పటినుంచి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు! అనే విషయాలు ఎవరికైనా తెలుసా!
ఏప్రిల్ 1వ తేదీ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళపైన జోక్స్ వేస్తూ.. ప్రాంక్ చేస్తూ.. వాళ్ళని ఫూల్స్ చేయడం. ఇది 200 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి అందరూ దీనిని పాటిస్తారు అని నమ్మితే మాత్రం మీరు ఫూల్ అయినట్లే. కానీ, అది కాదు వాస్తవానికి ఇటలీలో రోమ్ చక్రవర్తి భార్య పేరు.. స్ప్రింగ్ ఏప్రిల్.. ఇది ఎలాగూ స్ప్రింగ్ సీజన్ కాబట్టి.. ఆమె పుట్టిన రోజును అందరు కలిసి సరదాగా నవ్వుతు.. నవ్విస్తూ సెలెబ్రేట్ చేసుకోవాలని .. రోమ్ చక్రవర్తి అందరిని ఆదేశించాడట. అని ఎవరైనా చెప్తే.. నిజమని నమ్మారో మళ్ళీ మీరు ఫూల్ అయినట్లే. ఇలానే రకరకాల కట్టు కథలతో ఏప్రిల్ 1న ఫూల్స్ చేస్తూ ఉంటారు. అసలు విషయం ఏంటి అనే దానిపైన ఎవరికీ క్లారిటీ లేదు. దీని వెనుక రకరకాల కథనాలు ఉన్నాయి . అందులో కొన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొదటిగా 1582లో తయారుచేసిన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. అప్పట్లో న్యూ ఇయర్ అంటే ఏప్రిల్ 1వ తేదీన జరుపుకునేవారట. మెల్లగా కాలం మారుతున్న కొద్దీ .. న్యూ ఇయర్ ను జనవరి 1వ తేదీన జరుపుకోవడం ప్రారంభించినా కూడా.. కొంతమంది ఏప్రిల్ 1నే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను జరుపుకుంటూ ఉండేవారట. ఇక అలాంటి వారిని చూసి మిగిలిన వారు ఏప్రిల్ ఫూల్స్ అంటూ ఏడిపిస్తూ నవ్వుకునేవారట. ఇక అప్పటినుంచి అది కొనసాగుతూ వచ్చింది. వేరొక కథనానికి వస్తే.. దీని మూలాలు రోమన్ ఫెస్టివల్స్ కు లింక్ అయ్యి ఉన్నాయట.. ఆ ఫెస్టివల్ పేరు హిలారియా.. ఈ పండుగను మార్చి నెలాఖరులో జరుపుకునేవారట. ఆరోజున అందరు సిబెల్ అనే దేవతను ఆరాదించేవారట. కాబట్టి అందరు ఆరోజున రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకుని.. సరదాగా జోక్స్ వేసుకుంటూ.. ఎంజాయ్ చేసేవారట. ఒకరిని ఒకరు ప్రాంక్ చేసుకునే వారట. ఇంకా అలా అది కొనసాగుతూ.. ఏప్రిల్ 1న ప్రాంక్ డే గా మారిపోయిందని అంటూ ఉంటారు.
ఇక మరొక కథనానికి వస్తే.. ఈ సీజన్ లో సముద్రాల్లో లెక్క లేనన్ని చేపలు దొరికేవట. కాబట్టి ఏప్రిల్ నెల వచ్చిందంటే ఫిష్ సీజన్ గా భావించి.. దీనిని సెలెబ్రేట్ చేసుకునే ప్రక్రియలో అందరు ఫిష్ బ్యాడ్జెస్ ను ధరించుకునే వారట. అలా ఏప్రిల్ ఫిష్ అంటూ ఒకరికి ఒకరు సరదాగా ఆటపట్టించుకునే వారట. అది కాస్త రాను రాను ఫూల్స్ డే గా మారిపోయిందట . ఇలా రకరకాల కథనాలు ఉన్నాయి. ఏదేమైనా సరదాగా మనసారా నవ్వుకోడానికి .. నవ్వించడానికి ఓ రోజు ఉందని మరి కొంతమంది భావిస్తుంటారు. మనం చూసేవన్నీ నిజాలు కాదు.. వినేవన్నీ వాస్తవాలు కాదని అర్ధం చేసుకోవడానికి ఏప్రిల్ 1 సూచిస్తుందని.. మరికొంతమంది చెబుతూ ఉంటారు. మరి, ఇవన్నీ కూడా వాస్తవాలా .. అవాస్తవాలా ! వేటిని నమ్మాలి ! ఏమో ! మరి, ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.