Revanth Reddy: CM రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..లక్ష బెల్ట్ షాపులు క్లోజ్!

CM రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..లక్ష బెల్ట్ షాపులు క్లోజ్!

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా బెల్ట్ షాపుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనుంది.

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా బెల్ట్ షాపుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనుంది.

మద్యం కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇక ఊర్లలో బెల్ట్ షాపులకి కొదవే లేదు. ఈ బెల్ట్ షాపు కారణంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వీటిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే ఉంటాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా బెల్డ్ షాపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ..అదే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే బెల్ట్ షాపులను మూసి వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక దీని కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయనే విషయం అందరికి తెలిసిందే. అయినా కొందరు అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో ఈ బెల్టు షాపులు భారీగా పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలోని  బెల్ట్ షాపుల క్లోజ్ కు ప్రణాళికలు చేస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పనులు చేస్తున్నారు.  రాష్ట్రంలో బెల్ట్ షాపులను  మూసి వేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.  మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే  రాష్ట్రంలో బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులు ఉన్నాయి. ఈ దుకాణాలకు అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం12,769 గ్రామపంచాయతీలు ఉన్నాయి.  ఒక్కొక్క పంచాయితీలో 6 నుంచి 10 కి పైగా బెల్ట్ షాపులున్నాయని తెలుస్తోంది.  ఈ  లెక్కన యావరేజ్ గా  చూస్తే రాష్ట్రంలో లక్ష 10 వేలకు పైగా బెల్ట్ షాపులు ఉంటాయని అంచనా.

ఈ బెల్ట్ షాపుల్లో24 గంటల పాటు మద్యం అమ్ముతుండటం,  రాష్ట్రంలోని  యువత ఎక్కువగా మద్యానికి బానిసగా మారుతున్నారని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అలానే యువత జీవితాలతో ఆడుకుంటూ అనాధికారికంగా బెల్ట్ షాపు ఓనర్లు దందా చేస్తున్నారన్న ఆరోపణు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  బెల్ట్ షాపు లు క్లోజ్ చేయకుంటే వారిపై కేసులు పెట్టేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది.  మద్యం అమ్మకాల ద్వారా ఏటా రాష్ట్ర ఖజానాకు రూ.36వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా  బెల్టుషాపులు మూసేశారు.

కొత్త లైసెన్సీల వ్యాపారం డిసెంబర్1 నుంచి మొదలైంది. కాబట్టి, తిరిగి కొత్తగా బెల్టుషాపులతో అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. హోల్​సేల్, రిటైల్​పేరుతో రెండు రకాల లిక్కర్ ​దందా నడుస్తోందని తెలుస్తోంది. గ్రామాల్లో బెల్టుషాపులు తీసేస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.16 వేల కోట్ల ఆదాయం తగ్గొచ్చని ఎక్సైజ్​శాఖ అంచానా వేస్తుంది. అయినప్పటికీ దీని కారణం యువత చెడు మద్యానికి బాని కాకుండదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బెల్ట్ షాపుల మూసివేసి దిశగా అడుగులు వేస్తోంది. మరి.. తెలంగాణ ప్రభుత్వం తీసుకోనున్నా ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments