Venkateswarlu
Venkateswarlu
తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ కాలేజీ అడ్మిషన్ల విషయంలో కీలక మార్పు తీసుకువచ్చింది. తెలంగాణ విద్యార్థులకు మేలు చేకూరేలా.. తెలంగాణ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌ను సవరణ చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్, ఆర్టికల్ 371డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌లో మార్పులు చేసింది. ఈ మార్పులతో వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది.
సవరణ కారణంగా 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో.. కాంపిటీటివ్ అథారిటీ కోటాకు సంబంధించిన సీట్లు 100 శాతం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. సవరణకు ముందు 85 శాతం సీట్లు మాత్రమే తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో ఉండేవి. మిగిలిన 15 శాతం అన్ రిజర్వ్‌డు కోటాలో ఉండేవి. దీంతో 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ విద్యార్థులతో పోటీ పడేవారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు రాష్ట్రంలో 20 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండేవి.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య 56కు పెరిగింది. అప్పుడు తెలంగాణలో మొత్తం 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. ఇప్పుడు సీట్ల సంఖ్య 8340కు పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. వాటిలో 15 శాతం అన్ రిజర్వుడు కోటా కింద 280 సీట్లను కేటాయించాల్సి వచ్చేది. ఈ అన్ రిజర్వుడు కోటా ద్వారా తెలంగాణ విద్యార్థులతో పాటు, ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడి సీట్లు పొందేవారు. మరి, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌లో సవరణలు తీసుకురావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.