CM Revanth: మహిళలకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. వారి కోసమే మరో పథకం..

తెలంగాణలోని మహిళలకు రేవంత్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. వారి కోసం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణలోని మహిళలకు రేవంత్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. వారి కోసం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రధానంగా మహిళా సంక్షేమం మీద దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి కోసం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను అమలు చేస్తోంది. దాంతో పాటుగా త్వరలోనే మహిళకు నెలకు 2500 రూపాయలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో మహిళలకు రేవంత్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. వారి కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. మహిళలు ఆర్థిక స్వాలంభన సాధించేందుకు గాను ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టనుంది. ఇంతకు ఈ పథకం ఏంటి.. దీనికి అర్హులు ఎవరంటే..

రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా శక్తి-క్యాంటీన్‌ సర్వీస్‌ల ఏర్పాటుకు సీఎస్‌ శాంతి కుమారి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్‌స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తామని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. దీని కోసం కేరళలో అన్న క్యాంటీన్లు, బెంగాల్‌లో దీదీ కా రసోయ్‌ పేరుతో క్యాంటీన్ల పనితీరుపై అధ్యాయనం చేసినట్లు శాంతి కుమారి చెప్పుకొచ్చారు.

రానున్న రెండేళ్ల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాంతి కుమారి చెప్పుకొచ్చారు. ఈ క్యాంటీన్‎ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. క్యాంటీన్‎ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ ను సి.ఎస్ ఆదేశించారు.

Show comments