P Venkatesh
నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒకే కుటుంబంలో వరుసగా ఆరుగురు హత్యకు గురయ్యారు. స్నేహితుడే కదా అని నమ్మినందుకు కుటుంబాన్నే అంతమొందించాడు.
నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒకే కుటుంబంలో వరుసగా ఆరుగురు హత్యకు గురయ్యారు. స్నేహితుడే కదా అని నమ్మినందుకు కుటుంబాన్నే అంతమొందించాడు.
P Venkatesh
ప్రస్తుత కాలంలో పరువు కోసం, ప్రేమ కోసం వరుస హత్యలు జరుగుతునే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఆస్తి తగదాలు అనేవి విపరితంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో కుటుంబ బంధాల కంటే ఆస్తిపాస్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల సంఖ్య పెరుగుతూ పోతోంది. కేవలం ఆస్తి కోసం కన్నవాళ్లనే చంపుకొనే వైనం కనిపిస్తోంది. డబ్బు అనే మైకంలో పడి సొంత రక్త సంబంధాలనే పొట్టన పెట్టుకుంటున్నారు. రోజురోజుకి మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. ఇటివలే ఉత్తర్ ప్రదేశ్ లో ఆస్తి కోసం ఓ కూమారుడు సొంత తల్లి తల నరికిన ఘటన మరువక ముందే నిజామబాద్ లో మరో దారుణమైన సంఘటన అందరిని ఊలిక్కిపడేలా చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒకే కుటుంబంలో వరుసగా ఆరుగురు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం ఓ దుర్మర్గుడు తన స్నేహితుడి కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు. ఇంటి స్థలం కోసం వారం రోజుల వ్యవధిలో ఒకరికి తెలియకుండా మరొకరిని దారుణంగా హతమార్చాడు నిందితుడు. అయితే ఆరుగురిని చంపేసింది 20ఏళ్ల ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కథనం మేరకు.. మాక్లుర్‌కి చెందిన ప్రసాద్ కుటుంబం కొద్దిరోజుల క్రితం మాచారెడ్డిలో స్థిర పడింది. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. అయితే ప్రసాద్ కు ప్రశాంత్ అనే స్నేహితుడు ఉన్నాడు. అయితే దురాశతో స్నేహితుడైన ప్రసాద్ ఇంటిపై కన్నేశాడు ప్రశాంత్. దాని కోసం ప్రసాద్ తో లోన్ అవసరం ఉందని చెప్పి అతని పేరట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ప్రశాంత్. తీరా లోన్ రాకపోవడంతో తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఇది తట్టుకోలేక ప్రశాంత్ ఎలా అయిన అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు.
ప్రశాంత్ అనుకున్న ప్లాన్ ప్రకారం.. ప్రసాద్ ను మాట్లాడే పని ఉందంటూ బయటకు తీసుకెళ్లాడు. సరిగ్గా కామారెడ్డి జాతీయ రహదారి సమీపంలో ప్రసాద్ ని హత్య చేశాడు. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ ఇంటికెళ్లిన ప్రశాంత్, ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని నమ్మించి ఆయన భార్యను బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను చంపేసి బాసర నదిలో మృతదేహం పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హతమార్చాడు. ఇక ఇద్దరు పిల్లల్ని సోన్ బ్రిడ్జి సమీపంలో.. చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో దారుణంగా చంపేశాడు. చివరకు అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొదటి మూడు హత్యలు ప్రశాంత్ చేయగా.. మిగతా ముగ్గురి హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ప్రశాంత్ ను క్రైమ్ బ్యాగ్రౌండ్ పైనా ఆరాతీస్తున్నారు.