Hyderabadలో మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. రేపే శంకుస్థాపన

Hyderabad-Cognizant New Campus: ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ ఒకటి తన కొత్త క్యాంపస్ ని హైదరాబాద్ లో ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రేపే శంకుస్థాపన చేయనుంది. ఆ వివరాలు..

Hyderabad-Cognizant New Campus: ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ ఒకటి తన కొత్త క్యాంపస్ ని హైదరాబాద్ లో ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రేపే శంకుస్థాపన చేయనుంది. ఆ వివరాలు..

హైదరాబాద్ విశ్వనగరంగా డెవలప్ అవుతోంది. ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరంలో తమ కార్యాలయాలను స్థాపించి.. ఇక్కడ కూడా వాటి సేవలను విస్తరిస్తున్నాయి. ఇక హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చదిద్దడం కోసం తమ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ వెల్లడించింది. చెప్పడమే కాక.. రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి.. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం.. సీఎం రేవంత్ ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పిటికే అమెరికా పర్యటన ముగించుకున్నారు. రేవంత్ బృందం విదేశీ పర్యటన సత్ఫలితాలు ఇస్తుందని.. అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయని.. దీని వల్ల 33 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి అని తెలంగాణ సీఎంవో ప్రకటించిన సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా.. హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరణకు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. అంతేకాక కొత్త క్యాంపస్ కు రేపు అనగా ఆగస్టు 14, బుధవారం నాడు శంకుస్థాపన చేయనుంది. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టడం విశేషం. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ఇప్పిటికే ప్రకటించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్​ చేస్తుంది అని ఒప్పందం సందర్భంగా చెప్పుకొచ్చారు.

పెట్టబుడల నిమిత్తం.. విదేశాల్లో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ నెల 14వ తేదీ ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. అదేరోజు కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ కూడా హాజరవుతారు. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా తన సేవలు విస్తరించింది. హైదరాబాద్‌లో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్​లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ కాగ్నిజెంట్ లో దాదాపు 57 వేల మంది ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌కు పేరుంది. ఇప్పుడు మరో క్యాంపస్ ఏర్పాటుతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

Show comments