Dharani
Dharani
హైదరాబాద్‌లో ఓ వైపు ఎంతో సందడిగా గణేష్ నిమజ్జనం సాగుతోంది. చివరి రోజు కావడంతో.. సుమారు 11 రోజుల పాటు మండపాల్లో.. పూజలు అందుకున్న గణపయ్య.. గంగమ్మ ఒడికి తరలి వస్తున్నాడు. ఇప్పటికే ఖైరతాబాత్ మహా గణపతి నిమజ్జనం పూర్తయ్యింది. ఇక నగరవ్యాప్తంగా కొలువుదీరిన సుమారు లక్ష విగ్రహాలు.. నేడు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. ఇక నిమజ్జనం చివరి రోజైన నేడు అనగా.. గురువారం ఉదయం నుంచి వాతావరణం పొడిగానే ఉంది. ఇక ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి ఎండ మండి పోయింది.
దాంతో నిమజ్జనం చివరి రోజున భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే.. నిమజ్జనం రోజైనా గురువారం సాయంత్రం.. హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దాంతో వినాయక నిమజ్జనం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నిమజ్జనం సందర్భంగా ఇప్పటికే నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక దీనికి తోడు భారీ వర్షం కురుస్తుండటంతో.. నగర వాసులకు ట్రాఫిక్ జామ్ సమస్య ఎదురు కానుంది.
ఇక జోరువానలోనూ వినాయక శోభయాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎండ మండిపోగా.. నిమిషాల వ్యవధిలోనే భారీ వర్షం కురవడంతో.. సాయంత్రానికే చీకటి పడినట్లుగా వాతావరణం మారింది. ఇక బుధవారం సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే.