P Krishna
ఇటీవల హైదరాబాద్ లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్ని ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.
ఇటీవల హైదరాబాద్ లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్ని ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.
P Krishna
ఈ మద్య హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం శీతాకాలం కావడంతో చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో చలిమంటలు వేసుకోవడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా వ్యాపార సముదాయాలు, క్రాకర్ ఫ్యాక్టరీలు, కెమికల్ ల్యాబ్స్, ప్లాస్టీక్ గోదాములు, వస్త్ర సముదాయాల్లో సెఫ్లీ ఫైర్ తప్పని సరిగా ఉంచాలని నిబంధన ఉంది. కానీ కొంతమంది నిర్లక్ష్యం కారణంగా అందుబాటులో లేక అగ్ని ప్రమాదాలు జరిగినపుడు సరైన సమయాంలో రక్షణ కల్పించలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం తీవ్ర కలకం రేపింది. సోమవారం తెల్లవారు జామున దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన సిటీ ఎక్స్ ప్రెస్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా వ్యాపించి పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకున్నాయి. దీంతో అక్కడ చూస్తుండగానే రెండు బస్సులు ఒకేసారి కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే మరికొన్ని బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి.
అదృష్టం కొద్ది రెండు బస్సుల్లో మాత్రమే మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. అప్పటికే ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు అధికారులు. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బస్సులో మంటలు ఎలా వచ్చాయన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు. బస్సులో షాట్ సర్క్యూట్ అవడం వల్లనే ఈ మంటలు చెలరేగి ఉంటాయని డిపో అధికారులు భావిస్తున్నారు. కొంత కాలంగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.