HYDలోని సాఫ్ట్​వేర్ ఎంప్లాయీస్ కి గుడ్ న్యూస్! ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!

Gopanpally Flyover: నగరంలో జనాభా రోజు రోజుకీ పెరిగిపోతుంది.. దాంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు కూడా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఇటీవల ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గోపల్‌పల్లి ఫ్లైఓవర్‌ తో ప్రజల కష్టాలు తీరబోతున్నాయి.

Gopanpally Flyover: నగరంలో జనాభా రోజు రోజుకీ పెరిగిపోతుంది.. దాంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు కూడా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఇటీవల ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గోపల్‌పల్లి ఫ్లైఓవర్‌ తో ప్రజల కష్టాలు తీరబోతున్నాయి.

హైదరాబాద్‌లో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.నగర వాసులకు నగర శివారు ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యల నుంచి కాపాడేందుకు నిర్మించిన గోపల్‌పల్లి ఫ్లైఓవర్‌ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయ్యింది. శనివారం (జులై21) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. రూ.28.50 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ లో రెండు ఎగ్జిట్ ర్యాంప్ లు ఉన్నాయి. ఒకటి గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల వైపు 430 మీటర్లు, మరొకటి గౌలిదొడ్డి నుంచి తెల్లాపూర్ వైపు 550 మీటర్ల మేర నిర్మించారు. రేడియల్ రోడ్డు లో భాగంగా హెచ్‌సీయూ బస్టాండ్ నుంచి వట్టి నాగులపల్లి మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు.హైదరాబాద్ లోని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నగర శివార ఐటీ కారిడార్ లోని గోపన్ పల్లి తండా వద్ద నిర్మించిన వంతెనను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. వై ఆకారంలో నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకి రావడం వలత్ల ఐటీ ఉద్యోగులతో పాటు గోపన్ పల్లి, తెల్లాపూర్, నల్లండ్ల, కొల్లూరు వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు భవనాల శాఖ, పీవీ రావు నిర్మాణ సంస్త ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఐ ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం గోపాన్ పల్లి నుంచి వట్టి నాగులపల్లి ఓఆర్ఆర్ కు వెళ్లే రేడియల్ రోడ్డు తండా జంక్షన్ లో నిర్మించారు.నానక్‌రాం‌గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ కారిడార్ లకు వెళ్లేందుకు వేలాది కార్లు, ఇతర వాహనాలు గోపనపల్లి తండా కూడలి మీదుగా వెళ్లాలి. ఈ వంతెన నిర్మాణంతో లక్షల మంది ఐటీ, ఇతర ఉద్యోగుల కష్టాలు తీరనున్నాయి.

గత కొంత కాలంగా అన్ని వైపుల నుంచి వాహనాలతో వచ్చి ఈ కూడలి వద్ద ఇరుక్కుపోయేవారు.. దీంతో ట్రాఫిక్ జామ్ తో నానా ఇబ్బందులు పడేవారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ సమస్యతో ఐటీ ఉద్యోగులు తవతీవ్ర ఇబ్బంది పడేవారు. కొన్నిసార్లు సమయానికి ఆఫీస్ కి కూడా వెళ్లలేని పరిస్థి ఉండేది. ఇక పాఠశాల, కాలేజ్ విద్యార్థుల పరిస్థితి కూడా అలాగే ఉండేది. ట్రాఫిక్ కష్టాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వం ఇక్కడ నిర్మాణానికి పునాధి వేసింది. ఏది ఏమైనా ట్రాఫిక్ కష్టాలు తీరినందుకు అటు ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments