KCR అనారోగ్యంపై స్పందించిన కేటీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అనారోగ్యం కారణంగా గత కొద్దిరోజుల నుంచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 3 వారాలనుంచి ఆయన ప్రజలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కేసీఆర్‌ ఛాతి సంబంధింత ఇన్‌ఫెక్షన్‌ కారణంగా బాధపడుతున్నారట. ఆయన కోలుకోవటానికి ఇంకొంత కాలం పట్టే అవకాశం ఉందట. ఈ విషయాలను స్వయంగా కేసీఆర్‌ తనయుడు, మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. తాజాగా, కేసీఆర్‌ అనారోగ్యంపై కేటీఆర్‌ స్పందించారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ ఆయన ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. కొద్దిరోజుల క్రితం వైరల్‌ ఫీవర్‌, ఇప్పుడు బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ రావటంతో కోలుకోవటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది’’ అని అన్నారు. కేసీఆర్‌ ఛాతి సంబంధింత ఇన్‌ఫెక్షన్‌ కారణంగా బాధపడుతున్నారని తెలుసుకుంటున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. మరి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా బాధపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments