P Krishna
Youth on A Police Vehicle: ఈ మధ్య కాలంలో దేశంలో డ్రగ్స్, గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. దీంతో యువత మత్తులో జోగుతూ దారుణాలకు తెగబడుతున్నారు.
Youth on A Police Vehicle: ఈ మధ్య కాలంలో దేశంలో డ్రగ్స్, గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. దీంతో యువత మత్తులో జోగుతూ దారుణాలకు తెగబడుతున్నారు.
P Krishna
ఇటీవల యువత రాత్రిపూట వీరంగం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది గంజాయి బ్యాచ్ మత్తులో జోగుతూ దాడులకు తెగబడుతున్నారని ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించిసి రౌడీ మూఖలు, గంజాయి బ్యాచ్, మద్యం సేవించి అల్లరి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో యువత రెచ్చిపోతూనే ఉన్నారు. ఆ మధ్య ఓ యువకుడు గంజాయి సేవించి ఏకంగా పోలీస్ జీప్ పై ఎక్కి కూర్చొచిన నానా హడావుడి చేసిన ఘటన మరువక ముందే.. ఓ యువకుడు చేత్తో రాయి పట్టుకొని ఏకంగా పోలీస్ వాహనంపైకి దూసుకు వచ్చిన ఘటన కలకలం చేపింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని పాతబస్తీలో కొంతమంది తాగుబోతులు వీరంగా సృష్టించారు. వారిలో ఓ యువకుడు ఏకంగా పోలీస్ వాహనంపైకి రాయి రువ్వే ప్రయత్నం చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఆదివారం రాత్రి పాతబస్తీ నడిరోడ్డుపై యువకుడు హల్ చల్ చేశాడు. తాగిన మత్తులో రోడ్డు పై వచ్చిపోయే వారిని దుర్బాషలాడుతూ.. నానా రచ్చ చేశాడు. అంతలో అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోల్ వాహనాన్ని ఆపాడు. అందులో ఉన్న కానిస్టేబుల్ ఏం జరిగిందని ప్రశ్నించగా అతనిపై బూతు పురాణం మొదలు పెట్టాడు. అంతేకాదు.. పక్కనే ఉన్న రాయిని తీసుకొని కారులో ఉన్న పోలీస్ అధికారిపై విసిరే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పోలీస్ వాహనానికి అడ్డుగా నిలబడి రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు సదరు యువకుడిని పట్టుకొని వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇటీవల హైదరాబాద్ లో రాత్రి పూట రోడ్ల పక్కన టీఫిన్లు అమ్మడం ఎక్కువగా కనిపిస్తుంది. యువత ఎక్కువగా రాత్రి పూట బయట రోడ్ సైడ్ దొరికే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఇది వ్యాపారస్తులకు మంచి రాబడిగా మారింది. దీంతో ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్, ఇతర ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు. అయితే రాత్రి పూట ఫుట్‌పాత్ పై వ్యాపారం సాగించడానికి పర్మిషన్ తీసుకుంటారా? లేదా? అన్న విషయంపై తెలియాల్సి ఉంది. అయితే రాత్రి పూట బిర్యానీ, మండి, ఇడ్లీ.. దోశ దొరకడంతో చాలా మంది ఎగబడి తింటున్నారు. ఇక మందుబాబులు, గంజాయి బ్యాచ్ ఇదే అదునుగా రాత్రి వెళల్లో రెచ్చిపోతున్నారు. కొంతమంది గంజాయి బ్యాచ్ మత్తులో తూగుతూ పోలీసులు, వాహనాలపై దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా యువకుడు పోలీసులపై రాయి తీసుకొని వెళ్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు నానా రకాలుగా స్పందిస్తున్నారు. బిర్యానీ.. బీర్ మనోడి తలకెక్కినట్టుంది.. కిక్కు తో పిచ్చిగా రెచ్చిపోతున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.