Nothing Phone 2a Plus: క్రేజీ ఫీచర్లతో.. మిడ్ రేంజ్ ధరలో నథింగ్ నుంచి కొత్త ఫోన్

క్రేజీ ఫీచర్లతో.. మిడ్ రేంజ్ ధరలో నథింగ్ నుంచి కొత్త ఫోన్

Nothing Phone 2a Plus: స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. మరో కొత్త మొబైల్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. మిడ్ రేంజ్ ధరలో ఉన్న ఈ ఫోన్ యూత్ ను ఆకట్టుకుంటోంది. దీని ధర ఎంతంటే?

Nothing Phone 2a Plus: స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. మరో కొత్త మొబైల్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. మిడ్ రేంజ్ ధరలో ఉన్న ఈ ఫోన్ యూత్ ను ఆకట్టుకుంటోంది. దీని ధర ఎంతంటే?

స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. మార్కెట్ లోకి రిలీజ్ అయ్యే కొత్త మొబైల్స్ ను కొనేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు స్మార్ట్ ఫోన్ ప్రియులు. స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అప్ డేటెడ్ ఫీచర్లతో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ న్యూ ఫోన్ ను రిలీజ్ చేసింది. కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ ప్యాకప్ కోసం చూసే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా మారనుంది. తాజాగా నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ రిలీజ్ అయ్యింది. నథింగ్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్ ఫోన్ కి అప్ డేటెడ్ గా ఈ కొత్త మొబైల్ ను తీసుకొచ్చింది. యూజర్లకు మిడ్ రేంజ్ ధరలో అందుబాటులో ఉండనున్నది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మోడల్ రెండు వేరియంట్లలో వస్తుంది. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+256జీబీ వేరియంట్ తో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 27,999, రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ కు సంబంధించిన సేల్స్ ఆగస్టు 07 నుంచి ప్రారంభం కానున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో 5జీ ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ రన్ కానుంది.

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 ఆపరేటింగ్ సిస్టంపై నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ రన్ కానుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా స్క్రీన్‌కు ప్రొటెక్షన్ లభించనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్9 సెన్సార్ అందించారు. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

Show comments